Ys Jagan Single Simham.. సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపుగా వస్తాయ్.! ఇదో సినిమా డైలాగ్. దీన్ని రాజకీయాలకు అన్వయించగలమా.? ఛాన్సే లేదు. అదొక నాన్సెన్స్ కూడా.!
రాజకీయమంటే ఏంటి.? ప్రజా సేవ.! ప్రజల మెప్పు పొందాలి ఏ రాజకీయ నాయకుడైనా. రాజకీయ పార్టీ అంటే.. అది ఓ వ్యక్తితో సాధ్యం కాదు.! అదొక సమూహం.!
వైసీపీ నేతలు పదే పదే ‘సింహం సింగిల్‌గా వస్తుంది..’ అని చెబుతుంటారు. అలాంటి సింగిల్ సింహం వల్ల ఎవరికి ప్రయోజనం.? ఏ విషయంలో అయినా, అదర్నీ కలుపుకుపోవాలి.
అధికారం శాశ్వతం కాదు.! అదొక నీటి బుడగ. టుప్పున పేలిపోతుంది.! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘సింగిల్ సింహం’ కొంప మునిగిపోయింది.!
‘మా ఓటర్లు వేరు’ అని బుకాయించాల్సి వచ్చింది కొందరు వైసీపీ నేతలకి. ఓటమికి బాధ్యత తీసుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాని ఈ దుస్థితిని ఏమనాలి.?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారూ.. జర జాగ్రత్త.! అతి పొగడ్త అనర్ధదాయకం.!
Mudra369
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే, అన్ని రాజకీయ శక్తుల్నీ కలుపుకుపోవాల్సిన బాధ్యత అదికార వైసీపీ మీదనే వుంటుంది. కానీ, ఆ పరిస్థితే లేదు రాష్ట్రంలో.
Ys Jagan Single Simham.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. వీళ్ళంతా ఎవరు.?
150 మందికి పైగా ఎమ్మెల్యేలు, దాదాపు ముప్ఫయ్ మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ సభ్యుల్ని కలుపుకుంటే).. వీళ్ళంతా ఎవరు.? ఇంతమందిని కలుపుకుంటేనే వైసీపీ అవుతుంది.
ఇక్కడ ‘సింగిల్ సింహం’ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నట్టు.? ఈ ఎలివేషన్ల వల్ల ఎవరికి ప్రయోజనం.?

అటు తిరిగి, ఇటు తిరిగి.. వైసీపీ నేతలే వైసీపీ (YSR Congress Party) కొంప ముంచేలా వున్నారు.. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (Ys Jagan Mohan Reddy) ‘సింగిల్ సింహం’ అనడం ద్వారా.
‘అంటరానితనం’ అనే మాట వాడటం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, వైసీపీ నేతల ‘సింగిల్ సింహం’ వ్యాఖ్యల కారణంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) చివరికి అంటరాని పార్టీలా మారిపోతోంది.
వైఎస్ షర్మిల తెలంగాణకు వెళ్ళిపోయారు.. కూతురి వెంట విజయమ్మ కూడా వెళ్ళిపోయారు. ఆ లెక్కన, సింగిల్ సింహం జగన్.. (Ys Jaga Mohan Reddy) అన్న మాటకి వేరే అర్థం కూడా వస్తుంది మరి.!
Also Read: Ram Gopal Varma Theory.. ఆర్జీవీ ‘తప్పుడు’ సిద్ధాంతం.!
సమయానికి బటన్ నొక్కగలను.! గ్రౌండ్ లెవల్‌లో మీరు సరిగ్గా పని చెయ్యకపోతే నేనేం చేయగలను.? అని స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యేలతో.!
వైఎస్ జగన్ సింగిల్ సింహం కాదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అనవసరమైన ఎలివేషన్లు మారి, పార్టీ కోసం వైసీపీ నేతలు పనిచేస్తే.. వైఎస్ జగన్ ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుంటుంది.