Ys Sharmila Jagan Rajareddy.. వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.!
సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైఎస్ షర్మిల ఈ వివాహ ఆహ్వాన పత్రిక అందించడంలో వింతేముంది.?
మేనల్లుడి పెళ్ళికి మేనమామ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారనడం నిస్సందేహం. తొలి ఆహ్వాన పత్రిక మేనమామకు అందడంలోనూ వింతేమీ లేదు.
తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద తొలి ఆహ్వాన పత్రికను వుంచిన వైఎస్ షర్మిల, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి, తన కుమారుడి పెళ్ళికి ఆహ్వానించారు.
Ys Sharmila Jagan Rajareddy.. అసలు సమస్య ఇదీ..
2019 ఎన్నికలకు ముందర అంతా బాగానే వుండేది. సోదరుడు వైఎస్ జగన్ కోసం సోదరి వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు.
అయితే, అధికార పీఠమెక్కాక వైఎస్ షర్మిలకు, పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేశారు. రాజ్యసభకు వెళ్ళే అవకాశమో, ఇంకో అవకాశమో ఆమెకు ఇవ్వలేదు వైఎస్ జగన్.

ఇంకోపక్క, వైఎస్ విజయమ్మకి వున్న ‘వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు’ అనే గౌరవాన్ని కూడా తొలగించడం చూశాం.
వైఎస్సార్ మరణం తర్వాత, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విజయమ్మ, పులివెందుల ఎమ్మెల్యేగా పని చేశారు. అయితే, వైసీపీ నుంచి విశాఖ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాక, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారామె.
సానుకూల స్పందన అంటే..
రాజశేఖర్ రెడ్డి మనవడి వివాహం జరుగుతోందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం పలికామనీ, సానుకూలంగా స్పందించారనీ జగన్‌ని కలిసిన అనంతరం షర్మిల వ్యాఖ్యానించారు.
మామూలుగా అయితే, ‘జగనన్న’ అనే మాట ఆమె నోట వచ్చేది. కానీ, ఆ మాట ఈసారి ఆమె నోటివెంట రాలేదు.

కాంగ్రెస్ పార్టీ వైపుగా షర్మిల అడుగులేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారట. ఆ మాటకొస్తే, తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని కూడా అప్పట్లో జగన్ వ్యతిరేకించారట.
Also Read: అక్కినేని నాగచైతన్య ‘దూత’ నిజంగా నిజమైపోతేనో.?
మొత్తమ్మీద రాజా రెడ్డి పెళ్ళితో అయినా, జగన్ – షర్మిల మధ్య పొలిటికల్ గ్యాప్ తగ్గుతుందా.? వేచి చూడాల్సిందే.