Ys Sharmila Rajiv Gandhi.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు.! ఎప్పుడు.? ఎక్కడ.?
తాజాగానే.. అది కూడా ఢిల్లీలోనే.! ఈ విషయాన్ని వైఎస్ షర్మిల (YSR Telangana Party Chief Ys Sharmila) స్వయంగా వెల్లడించారు. రాజీవ్ గాంధీని మాత్రమే కాదు, సోనియా గాంధీని కూడా కలిశారట వైఎస్ షర్మిల.
అదేంటీ, అప్పుడెప్పుడో.. చాలా సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దారుణ హత్యకు గురయ్యారు కదా.! అన్న డౌట్ మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు.!
Ys Sharmila Rajiv Gandhi.. అసలు విషయమేంటంటే..
ఢిల్లీలో సోనియా గాంధీనీ అలాగే రాహుల్ గాంధీని కలిశారు వైఎస్ షర్మిల (Ys Sharmila). ఇదీ అసలు సంగతి. రాహుల్ గాంధీని కలిశానని చెప్పబోయి, ఆమె తడబడ్డారు.. రాజీవ్ గాంధీ పేరు చెప్పేశారు.

సరే, చిన్న పాటి తడబాటు తప్పు కాదు.! రాజకీయాల్లో వున్న వారు చాలామంది ఇలా తడబడుతుంటారు. సామాన్యులైనా అంతే.! దీన్ని పెద్ద యాగీ కోణంలో చూడాల్సిన పనిలేదు.
కాకపోతే, ఓ విషయంలో వైఎస్ షర్మిల (YSR Telangana Party Chief YS Sharmila) దారుణంగా ట్రోల్ చేయబడుతున్నారు.
కేసీయార్‌కి కౌంట్ డౌన్ మొదలైంది..
ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవాల్సిన అవసరం వైఎస్ షర్మిలకి ఏమొచ్చింది.? వైఎస్సార్ తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో ఆమె విలీనం చేయబోతున్నారా.?
చాలా ప్రశ్నలున్నాయ్.! కానీ, వాటికి ఆమె సమాధానం చెప్పలేదు. ‘కేసీయార్‌కి (Telangana Chief Minister KCR) కౌంట్ డౌన్ మొదలైంది’ అని మాత్రమే సెలవిచ్చారు.
Also Read: నా సామిరంగ.! ‘కింగ్’ నాగ్ అంటే ఇట్లుండాలె.!
కేసీయార్‌కి (Telangana CM KCR) కౌంట్ డౌన్ మొదలయ్యిందా.? లేదా.? అన్నది వేరే చర్చ.! తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ (YSR Telangana Party) వుంటుందా.? వుండదా.?
తెలంగాణ రాజకీయాల్ని వదిలేసి, వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లోకి వెళతారన్న ప్రచారంలో నిజమెంత.?
తన తండ్రి మరణం వెనుక కుట్ర వుందంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ మీద నేరుగానే ఆరోపణలు చేసిన వైఎస్ షర్మిల, అదే కాంగ్రెస్ అధినేత్రిని కలవడమేంటో.! కేసీయార్‌కి కౌంట్ డౌన్ అని ప్రకటించడమేంటో.!