Home » దత్త పుత్రిక వైఎస్ షర్మిల.? వైసీపీ నేత రోజా ఉవాచ.!

దత్త పుత్రిక వైఎస్ షర్మిల.? వైసీపీ నేత రోజా ఉవాచ.!

by hellomudra
0 comments
Roja Selvamani

Ys Sharmila Vs Roja.. పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అనే కామెంట్ పదే పదే చేస్తుంటుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. చాలాకాలం క్రితం నారా లోకేష్ చేసిన పద ప్రయోగమిది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నిత్యం ఇదే జపం చేస్తుంటారు.. పవన్ కళ్యాణ్‌ని ‘దత్త పుత్రుడు’ అని పేర్కొంటూ.! లోకేష్, జగన్ మధ్య తెరవెనుక ఏం సంబంధాలున్నాయో ఏమో.. అది వేరే చర్చ.

తాజాగా, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల మీద, ‘దత్త పుత్రిక’ అంటూ కామెంట్ చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా. సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు రోజా ట్వీటేశారు.

రాజకీయాల్లో ‘దత్త’ అన్న కాన్సెప్టే నాన్సెన్స్.! నోటికొచ్చింది వాగడం, రాజకీయ నాయకులకు పరిపాటి. ఈ క్రమంలోనే, ‘దత్త పుత్రుడు.. దత్త పుత్రిక..’ అనే కామెంట్లు వస్తున్నాయ్.

Ys Sharmila Vs Roja.. వైసీపీ మార్కు ‘దత్త’ రాజకీయం.!

అయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల మీద, ‘దత్త పుత్రిక’ అనే కామెంట్‌ని వైసీపీ నేత రోజా చేయడమే హాస్యాస్పదం.!

సాటి మహిళ మీద, ‘దత్త పుత్రిక’ అంటూ రోజా ఎలా కామెంట్ చేయగలిగారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమీ కాదు. పోలీస్ అధికారుల మీద ‘లం’ భాష వాడిన ఘనత రోజా సొంతం.

Ys Sharmila
Ys Sharmila

అంతెందుకు, నారా లోకేష్ మీద ‘డిక్కీ బలిసిన కోడి’ అని చాలా సందర్భాల్లో రోజా కామెంట్లు వేయడం చూశాం. రోజా అంటేనే అంత. ఆమె మాటకి హద్దూ అదుపూ వుండదు.

తన సోదరి షర్మిల మీద ‘దత్త పుత్రిక’ అనే కామెంటేసిన రోజా మీద వైఎస్ జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు.? అంటే, ఛాన్సే లేదు.! రోజాకి ఆ స్వేచ్ఛ ఇచ్చిందే వైఎస్ జగన్.

Also Read: మీనాక్షి చౌదరి పెళ్ళి పుకారు! ఈ ‘గాలి వార్త’ని వండి వడ్డించిందెవరు?

విజయమ్మ మీద ‘దత్త తల్లి’ అనీ, బతికి వుండి వుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కూడా ‘దత్త తండ్రి’ అనగలిగే స్థాయికి రోజా దిగజారిపోతుందనడం నిర్వివాదాంశం.

విలువలు, విశ్వసనీయత.. అంటూ వేదికలెక్కి ప్రసంగాలు చేసే వైఎస్ జగన్, తన సోదరి షర్మిలపై తమ పార్టీ నాయకురాలు రోజాతో ‘దత్త పుత్రిక’ అనే కామెంట్లు ఎలా చేయించగలిగారో ఏమో.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group