Ys Vivekananda Reddy Blunder.. ‘వివేకం సార్ అంటే మాకు అభిమానం.. అందుకే, ఆయన పరువు పోకూడదనే.. కొన్ని రహస్యాలు దాచి పెట్టాం..’ అంటున్నారు వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.
వైఎస్ వివేకానందరెడ్డి స్వయానా బాబాయ్ అవుతారు వైఎస్ అవినాష్ రెడ్డికి. 2019 ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
దురదృష్టం, నాలుగేళ్ళయినా వైఎస్ వివేకానంద రెడ్డి (Ys Vivekananda Reddy) హత్య కేసులో దోషులకు శిక్ష పడలేదు. అసలు దోషులెవరన్నదీ ఇంతవరకూ తేలలేదు.
Ys Vivekananda Reddy Blunder.. ఎంత దారుణమిది.?
చిత్ర విచిత్రమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. వేరే మహిళతో అక్రమ సంబంధమట.. ఇంకో మహిళతో రెండో పెళ్ళి అట.! ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి మీద.
నిజానికి, వివేకానంద రెడ్డి అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. మంత్రిగా పని చేశారు, ఎంపీగా కూడా పని చేశారు. అలాంటి వివేకానంద రెడ్డి మీద ఇలాంటి ఆరోపణలు ఏంటో.!
పోయినోళ్ళంతా మంచోళ్ళేనంటారు.. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.!
బతికున్నన్నాళ్ళూ మంచోడు.. చనిపోయాక ఛండాలుడన్నట్టు తయారైంది పరిస్థితి.
Mudra369
ఇంతకీ, వివేకానంద రెడ్డి చనిపోయాక ఈ అంశాలెందుకు తెరపైకొస్తున్నాయి.? ఆస్తుల పంపకాల్లో నిజంగానే గొడవలు జరిగాయా.? అవే హత్యకు కారణమా.?
నారాసుర రక్త చరిత్ర ఏమైంది.?
అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఇప్పుడేమో, జస్ట్.. కుటుంబ కలహాల వల్ల జరిిన హత్య అంటున్నారు. అయినాగానీ, మరీ అంత దారుణ హత్య ఎలా జరిగిందబ్బా.?
Also Read: Pushpa The Rule Begins: క్లారిటీ లేదు ‘పుష్పా’.!
ఇప్పుడీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతున్న తీరు చూస్తోంటే, కొత్త అనుమానాలు తెరపైకి రాకుండా వుంటాయా.?
ఏమో, ఈ కేసు చివరికి ఎలా తేలుతుందోగానీ.. మిస్టర్ వివేకం.. ఇలా ఎందుకు చేశావ్.? అంటూ, వివేకానంద రెడ్డి ఆత్మ తనను తాను ప్రశ్నించుకునే స్థితి వచ్చిందన్నది నిర్వివాదాంశం.
చివరగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Raja Sekhar Reddy) అదృష్టవంతుడు.. ఆయన మీద ఇలాంటి మచ్చలు, మరకలు ఏమీ అంటలేదు.!