YsJagan Why Not 175.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్షాలకు సవాల్ విసిరేశారు. ధైర్యముంటే 175 సీట్లలో పోటీ చేయగలరా.? అంటూ విపక్షాల్ని ప్రశ్నించేశారు.!
అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటి.? ఎన్నికల వ్యవస్థ అంటే ఏంటి.? అన్న విషయాలపై అస్సలేమాత్రం అవగాహన లేకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలా.?
ఓ వ్యక్తి, తాను ప్రజలకు సేవ చేయాలనుకుంటే.. దానికి రాజకీయాలే ఓ మార్గం అనుకుంటే రాజకీయాల్లోకి రావొచ్చు. ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఆయన్ని గెలిపించాలా.? లేదా.? అన్నది ఓటర్ల ఇష్టం.
YsJagan Why Not 175.. ఓటర్లను ప్రభావితం చేసేవి ఇవీ..
ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఓటర్లను కులం, మతం, ప్రాంతం.. వీటన్నిటికీ మించి ప్రలోభాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
తన మీద తనకు నమ్మకముంటే.. వేరే పార్టీలు కలిసొస్తాయో, విడివిడిగా వస్తాయో వాళ్ళిష్టం.. అనాలి కదా.?
ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడ.? ఎలా.? పోటీ చేయాలన్నది ఆయా వ్యక్తులు లేదా, పార్టీల ఇష్టం.!
ప్రభుత్వ ప్రకటనల కోసం వెచ్చించే ప్రజా ధనాన్ని, ఆ ప్రజల కోసం వినియోగిస్తే.. అదనంగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కదా.?
రాజకీయ విమర్శల కోసం పార్టీ వేదికల్ని వినియోగించుకోవాలి తప్ప.. అధికారిక వేదికల్ని వాడుకోవడం ఏ నైతిక విలువలకు నిదర్శనం.?
Mudra369
సో, ఇక్కడ కావాల్సింది ధైర్యం కాదు.! డబ్బు.! వందల కోట్లు, వేల కోట్లు వుంటే ఎవరైనా ఎన్ని స్థానాల్లో అయినా పోటీ చేయొచ్చు. టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు.. అన్ని నియోజకవర్గాల్లో విడివిడిగా పోటీ చేయాలనుకుంటే, వాటికి ధైర్యం అవసరం లేదు.
జనాన్ని గెలిపించడం కోసం..
ప్రతిసారీ రాజకీయమే గెలుస్తోంది.. ఔను, చాలాకాలంగా నడుస్తోన్న తంతు ఇది. ప్రజలెప్పుడు గెలుస్తారు.? ఇదీ జనసేన ఆలోచన. ప్రజల్ని పల్లకీ ఎక్కించాలన్నది జనసేన సిద్ధాంతం.

సరే, జనసేన అధికారంలోకి వస్తే, ఆ తర్వాత ఏమవుతుందన్నది వేరే చర్చ. జనసేన సిద్ధాంతమైతే ప్రస్తుతానికి జనాన్ని అధికార పీఠమెక్కించడమే.
జనం, ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారా.? లేదా.? అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ, ఈలోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొందరపడుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ప్రజా ధనంతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలేంటి.? ఈ విషయంలో కాస్త ఇంగితాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రదర్శిస్తారని ఆశిద్దాం.

ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు.? అన్నది ఆయా పార్టీల ఇష్టం. ఎవరో శాసిస్తే, ఎవరో సవాల్ విసిరేస్తే అది హాస్యాస్పదమవుతుంది తప్ప, అందులో అర్థం వుండదు.
చివరగా.. 175 నియోజకవర్గాల్లోనూ గెలిచేసినా.. ప్రజాస్వామ్యంలో ‘రాజు’ అయ్యే అవకాశం లేదు.! అలా గెలిచినోడు కూడా ప్రజా సేవకుడే అవుతాడు.!
ఓడిపోవడం అవమానం కాదు.! ఓడినోడు సైతం సేవకుడే.! గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో విర్రవీగడం కోసం కాదు, ప్రజాసేవ కోసం.! ఈ వాస్తవం మన రాజకీయ నాయకులకు ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!