YSRCP 150 Plus.. ఎన్నికల పోలింగ్ అయిపోయింది. జూన్ 4వ తేదీ వరకు ఎవరి లెక్కలు వాళ్ళు వేసేసుకుంటారు. ఇది మామూలే.!
మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ తమకు తోచిన లెక్కల్ని ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులు, సామాన్యులు, రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
ఓటరు నాడి పట్టుకోవడం అంత తేలిక కాదు.! కాకపోతే, ‘వేవ్’ అనేదాన్ని కాస్త అటూ ఇటూగా అంచనా వేయడం రాజకీయ విశ్లేషకుల, రాజకీయ పరిశీలకుల పని.
కానీ, ఇప్పుడంతా మారిపోయింది. ఇక్కడెవరూ రాజకీయ విశ్లేషకులు లేరు, రాజకీయ పరిశీలకులు అసలే లేరు. జర్నలిస్టులు ఎప్పుడో ఎర్నలిస్టులుగా మారిపోయారు.
YSRCP 150 Plus.. కనిపించేదంతా నిజం కాదు.!
సో, కనిపిస్తున్నదేదీ నిజం కాదు. వినిపిస్తున్నదీ నిజం కాదు.! ఓటర్లను డబ్బుతో నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు కొనేయడం చూశాం.
ఐదొందల రూపాయల దగ్గర్నుంచి, ఐదు వేలు ఆ పైన ఖర్చు చేయాల్సి వచ్చింది ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకీ, కొన్ని పార్టీలకీ.
రికార్డు స్థాయి పోలింగ్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో నమోదయ్యింది.
సాధారణంగా ఈ పరిస్థితిని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడినట్లుగా అంచనా వేస్తుంటారు రాజకీయ విశ్లేషకులు. గతంలో ఇదే జరిగింది.
ఈసారీ అలాగే జరుగుతుందా.? అప్పట్లో టీడీపీని ఇంటికి పంపిన ఓటర్లు, ఈసారి వైసీపీని ఇంటికి పంపిస్తారా.?
Mudra369
కొన్ని చోట్ల ఓటుకి పది వేల రూపాయలు కూడా పంచినట్లు చెబుతున్నారు. ఓటర్లు, నానా తంటాలూ పడి, ఆ సొమ్ముల్ని దక్కించుకున్నారు కొన్ని చోట్ల.
అభ్యర్థులు కూడా, ఓటర్లను నానా రకాలుగా ప్రలోభపెట్టారు.. అయితే, ఆ ఓటర్లు ఆయా అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు వేశారా.? లేదా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

కొన్ని చోట్ల వైసీపీ విచ్చలవిడిగా ఖర్చు చేస్తే, వైసీపీ పోటీగా టీడీపీ కూడా కొన్ని చోట్ల బాగానే ఖర్చు చేసింది. జనసేన అభ్యర్థులకు సంబందించి ఎక్కడా ఈ తరహా ప్రచారాలు తెరపైకి రాలేదు.
ఎన్నికల ప్రసహనం..
ఇదీ ఎన్నికల ప్రసహనం.! ఇంత జరిగాక, ‘150 ప్లస్ సీట్లకు ఏమాత్రం తగ్గం. గతంలో కంటే ఎక్కువే వస్తాయ్..’ అంటూ ఐ-ప్యాక్ టీమ్‌ని కలిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరమేమీ కాదు.
ఐ-ప్యాక్ టీమ్ అంటే, అసత్య ప్రచారాల్ని రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిన సంస్థ. నేరం చేసినోడే బాధితుడన్నది ఐ-ప్యాక్ సిద్ధాంతం.!
తప్పుని ఒప్పుగా.. ఒప్పుని తప్పుగా భ్రమింపజేయగలడం అన్నిసార్లూ సాధ్యమవుతుందా.? ఓటర్లను ప్రలోభ పెట్టడం అన్నిసార్లూ సాధ్యపడుతుందా.? మరీ అంత గుడ్డిగా రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తారా.?
Mudra369
ఏమో, ఇలాంటి సంస్థలు రాజకీయ పార్టీలకు సలహాదారులుగా మారిపోయాక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అనే కాదు, ఎక్కడైనా ఎన్నికల ఫలితాలు ఎలాగైనా వుండొచ్చు.
కానీ, గతంలో జరిగిన తప్పు ఇంకోసారి జగరకూడదన్నది ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల (Andhra Pradesh Assembly Elections 2024) సందర్భంగా ప్రముఖంగా వినిపించిన వాదన.
చూద్దాం.. ఏం జరుగుతుందో.!