YSRCP Polling Booth.. బూతు అంటే, తిట్టుకునే బూతు అనుకునేరు.! ఇది ఎన్నికల్లో ఓటేసేందుకు వినియోగించే పోలింగ్ బూతు.!
మామూలుగా అయితే, ఏ రాజకీయ పార్టీ మద్దతుదారుడైనాసరే, ఓటు వెయ్యాలంటే, ‘పోలింగ్ బూత్’కి వెళ్ళి ఓటు వెయ్యాల్సిందే.
ముఖ్యమంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, ఇంకెవరైనా.. ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి పద్ధతిగా క్యూ లైనులో నిల్చుని ఓటు వెయ్యాలి.
పోలింగ్ బూత్ అంటే.. ఏ పార్టీ మద్దతుదారులైనా, సామాన్యులైనా.. ప్రజా ప్రతినిథులైనా.. ఓటు వెయ్యడానికి అక్కడికే రావాలి.!
ఆయా పార్టీల కోసం విడి విడిగా పోలింగ్ బూత్స్ వుండవు.
ఐదేళ్ళు అధికారంలో వున్న వైసీపీకి ఈ మాత్రం తెలియదా.? నాన్సెన్స్.!
Mudra369
ప్రోటోకాల్ అనేదొకటి ఏడుస్తుంది గనుక, భద్రతా పరమైన సమస్యలు రాకుండా, ‘వేగంగా ఓటేసి వెళ్ళేందుకు’ ఆయా పోలింగ్ బూతుల్లో కాస్సేపు ప్రత్యేక చర్యలుంటాయ్.
YSRCP Polling Booth.. పార్టీకో పోలింగ్ బూత్.. నాన్సెన్స్.!
అంతే తప్ప, ఓ రాజకీయ పార్టీకి ఓ పోలింగ్ బూతు, ఇంకోపార్టీ వారికి మరో పోలింగ్ బూతు.. ఇలా వేర్వేరు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయరు.
ఐదేళ్ళు అధికారంలో వున్న ఓ రాజకీయ పార్టీకి, పోలింగ్ బూత్ అంటే ఏంటో కూడా తెలియకపోవడం హాస్యాస్పదం, శోచనీయం.

వైసీపీ పోలింగ్ బూత్‌లో జనాలున్నారు.. టీడీపీ పోలింగ్ బూత్‌లో జనాల్లేరు.. అంటూ ఓ పోస్ట్ పెట్టింది వైసీపీ, తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో.
‘వైఎస్సార్సీపీ విజయ కేతనం – వైసీపీ బూత్’ అనీ, ‘కూటమి భారీ పరాభవం – టీడీపీ బూత్’ అనీ, ఆ పోస్ట్ సారాంశం. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?
అదీ పోలింగ్ రోజున.. ఈ చెత్త పోస్ట్ చూసి, ఓటర్లు ప్రభావితమవుతారని వైసీపీ అనుకుందేమోగానీ, వైసీపీని ఛీత్కరించుకున్నారు ప్రజలు.
నవ్వాల్సింది నోటితో కాదు..
నోటితో నవ్వలేక, దేంతోనో నవ్వాల్సి వచ్చింది రాష్ట్ర ప్రజానీకం ఈ వైసీపీ ట్వీట్ చూసి.! వైసీపీ సెల్ఫ్ ట్రోలింగ్ ట్వీట్‌గా దీన్ని చాలామంది చూస్తున్నారు.

ఇలాంటి పార్టీకా ఐదేళ్ళపాటు రాష్ట్రంలో అధికారం కట్టబెట్టింది.? అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిస్తే, జనం గెలిచినట్టే.!
కింద పడ్డా పై చేయి తమదే అన్నట్టుగా వుంది వైసీపీ పరిస్థితి.! వైసీపీ అధికారం కోల్పోయాక, ‘మా ప్రభుత్వం వేరే వుంది..’ అని బుకాయిస్తారేమో.!
నవ్విపోదురుగాక వైసీపీకేటి సిగ్గు.?