Yuvraj Singh The Fighter.. యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ అభిమానులకు ఈ పేరుని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
‘ది ఛాంపియన్’ యువరాజ్ సింగ్. ఔను, అటు బ్యాటింగ్ అలాగే ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి టీమిండియాకి ఎన్నో విజయాల్ని ‘ఒంటిచేత్తో’ అందించిన ఘనుడు యువరాజ్ సింగ్.
కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, అంతకు మించి.! ఔను, యువరాజ్ సింగ్ అంటే వెరీ వెరీ స్పెషల్. క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా, ఆ బాధను పంటి బిగువన దాచిపెట్టి, టీమిండియాకి ప్రపంచ కప్ అందించిన ఫైటర్ యువరాజ్ సింగ్.
Yuvraj Singh The Fighter.. క్యాన్సర్ అంతు చూశాడు..
క్యాన్సర్ సోకడంతో తన జీవితం ముగిసిపోయిందని యువరాజ్ సింగ్ బాధపడలేదు. క్యాన్సర్‌పై పోరాటంలో విజయం సాధిస్తానని గట్టిగా నమ్మాడు.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా చాలా నొప్పిని, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యల్నీ ఎదుర్కొన్నట్లు, ఆ క్యాన్సర్ నుంచి బయట పడ్డాక వెల్లడించాడు యువీ.
Also Read: అంబాసిడర్ కారుకి ఆ రాజసం మళ్ళీ దక్కేనా.?
అంతే కాదు, క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత, తనలా క్యాన్సర్ బారిన పడ్డవారికి సాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే వున్నాడు. ఈ క్రమంలో యువీ చేస్తోన్న గుప్తదానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
క్యాన్సర్ సోకిన తర్వాత అసలు జీవితమే లేదని చాలామంది బాధపడుతుంటారు. అలాంటివారిలో యువీ ధైర్యం నింపాడు.
ఇంకోపక్క, క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుని, తిరిగి క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. అంతలోనే రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు క్రికెట్‌కి.
జూనియర్ ఛాంపియన్.!
ఇదిలా వుంటే, హేజెల్ కీచ్‌తో వైవాహిక బంధానికి గుర్తుగా, ఫాదర్స్ డే సందర్భంగా తన కుమారుడ్ని ప్రపంచానికి పరిచయం చేశాడు యువీ.

యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్‌ల పుత్రరత్నం పేరు ఓరియన్ కీచ్ సింగ్. ఈ పేరుకి అర్థమేంటి.? అన్న కోణంలో నెటిజన్లు ఇంటర్నెట్‌లో వెతుకులాట షురూ చేశారు. నక్షత్రాల సమూహమని దానికి అర్థమట.
యువీలాగానే, ఓరియన్ కీచ్ సింగ్ కూడా క్రికెటర్ అవుతాడా.? అవ్వాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు. క్రికెటర్ అయినా అవ్వకపోయినా, ఓరియన్ కీచ్ సింగ్ ఖచ్చితంగా ఫైటర్ అవుతాడన్నది యువీ అభిమానుల గట్టి నమ్మకం.