Table of Contents
118 Trailer Review Thrilling Concept కనిపించని ఓ అమ్మాయి కోసం వెతుకుతుంటాడో వ్యక్తి. ఆ అమ్మాయి ఎవరు? అసలు వుందా? లేదా? ఇదే అసలు కథ. ఆ కథేంటో తెరపై చూడాల్సిందే.
Success and Failure tho sambandham lekunda vilakshana Chitralni Enchukuntonna Kalyan Ram eesari maro prayogatmaka cinema chesada? నందమూరి కళ్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కొత్త సినిమా ‘118’ ట్రైలర్ (118 Trailer Review Thrilling Concept) సంగతులివి.
ట్రైలర్‌తో మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచేశారు ‘118’ దర్శక నిర్మాతలు. స్టయిలిష్ లుక్‌తో నందమూరి కళ్యాణ్‌రామ్ కన్పిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్ సరసన ఈ సినిమాలో షాలిని పాండే Shalini Pandey (అర్జున్ రెడ్డి ఫేం Arjun Reddy Fame) నటిస్తోంది.
మరో ముఖ్యమైన పాత్రలో కేరళ కుట్టి నివేదా థామస్ (Nivetha Thomas) నటిస్తుండగా, సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. Natigaa ippatike thanento palu chitralatho niroopinchukundi Nivetha Thomas.
https://youtu.be/KypNI5ug4vk
Something Suspicious
సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ (KV Guhan) దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ 118 ట్రైలర్‌తోనే 118 Trailer Review: Thrilling Concept అటెన్షన్‌ని ఆల్‌మోస్ట్ సంపాదించేసుకుంది. ప్రభాస్ రాజు, హర్షవర్ధన్ సపోర్టింగ్ రోల్స్‌లో కన్పిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నాజర్ తన సీనియారిటీని రంగరించినట్లే కన్పిస్తోంది.
అసలు కళ్యాణ్ రామ్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడా? అన్న అనుమానాలు కలిగేలా డాక్టర్ పాత్రలో నాజర్ వ్యవహరిస్తున్నాడు. కల, పీడ కల.. అంటుంటాడు నాజర్. కళ్యాణ్‌రామ్ మాత్రం, తాను నమ్మిందే నిజమన్న భావనలో వుంటాడు.
ఎవరా అజ్నాత యువతి (118 Trailer Review Thrilling Concept)
ఇంతకీ ఎవరా అజ్ఞాతంలో వున్న అమ్మాయి? ఆ అమ్మాయి వెనుక అసలు కథేంటి? అన్న ప్రశ్నలకు లైటర్ వీన్‌లో ఓ సమాధానం కూడా దొరుకుతుంది. ‘సిస్టమ్‌కి ఎదురు వెళుతున్నావ్..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ విన్పిస్తుంటుంది.
అంటే, కళ్యాణ్‌రామ్ వెతుకుతున్న అమ్మాయి నివేదా థామస్ వుందన్నమాట, ఆమెకి ఓ కష్టం వచ్చిందన్నమాట. ఆ కష్టమేంటో మాత్రం తెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఆమెను హీరో రక్షించాడా? మరి, షాలిని పాండే పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై దొరుకుతుంది.
టెక్నికల్‌గా మాట్లాడుకోవాలంటే.. (118 Trailer Review Thrilling Concept)
సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడేలా వున్నాయి (118 Trailer Review Thrilling Concept). స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో కె.వి. గుహన్ తన డైరెక్టోరియల్ వెంచర్ కోసం సినిమాటోగ్రఫీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కన్పిస్తోంది. ఓవరాల్‌గా సినిమాటోగ్రఫీ నుంచి మంచి ఔట్‌పుట్ వచ్చినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
సినిమాటోగ్రఫీ తర్వాత మాట్లాడుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర (Sekhar Chandra)అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్‌కి ప్రాణం పోసినట్టే వున్నాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా రిచ్‌గా తెరకెక్కాయి.
నటీ నటుల సంగతి ఇదీ..
నటీనటుల్లో కళ్యాణ్‌రామ్ (Kalyan Ram Nandamuri), షాలిని పాండే (Shalini Pandey), నివేదా థామస్ (Nivetha Thomas) తమ నటనా ప్రతిభతో ఆకట్టుకున్నారు. సినిమాలో వీరి నుంచి ఇంకా మంచి పెర్ఫామెన్స్‌ని ఆశించవచ్చుననే నమ్మకం కలిగించింది టీజర్.
ఓవరాల్‌గా ట్రైలర్‌తో సినిమాపై అంచనాల్ని పెంచేయగలిగారు. అయితే మొన్నీమధ్యనే ‘నా నువ్వే’ (Naa Nuvve) సినిమాతో నిరాశపర్చిన కళ్యాణ్‌రామ్, ఈసారేం చేస్తాడన్నదే సస్పెన్స్.