బొమ్మతో బాక్సింగు.! గొడ్డలితో గుండె పోటు.!

 బొమ్మతో బాక్సింగు.! గొడ్డలితో గుండె పోటు.!

Pawan Kalyan Boxing YSRCP

YSRCP Boxing Pawan Kalyan.. రాజకీయ పార్టీలన్నాక విమర్శలు మామూలే.! రాజకీయమన్నాక నిరసన ప్రదర్శనలూ మామూలే కావొచ్చు.!

రోడ్ల మీద నిరసన ప్రదర్శనల్లో భాగంగా దిష్టిబొమ్మల్ని తగలెయ్యడమే దండగమారి వ్యవహారం.! అత్యుత్సాహంతో ఒళ్ళు కాల్చుకున్న రాజకీయ కార్యకర్తలైన అమాయకులెందర్నో చూశాం.

కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభల్లో, ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన నేతల బొమ్మల్ని పెట్టి, వాటిని కొట్టి, నాశనం చేయడం అనేది ముమ్మాటికీ పైశాచిక ఆనందమే.!

YSRCP Boxing Pawan Kalyan.. వాళ్ళు బాక్సింగ్ చేస్తే, వీళ్ళు యూరిన్ పోస్తారు.!

పవన్ కళ్యాణ్ బొమ్మ ముందర బాక్సింగ్ బ్యాగ్ ఏర్పాటు చేశారు విశాఖపట్నంలోని భీమిలిలో వైసీపీ ఏర్పాటు చేసిన ‘సిద్ధం’ బహిరంగ సభలో.

వైసీపీకి చెందిన కొందరు పైశాచికానందంతో ఈ బొమ్మ ముందర పెట్టిన బాక్సింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ ఆడేశారు.. బొమ్మని నాశనం చేశారు.. కాళ్ళతో తొక్కారు కూడా.!

ఇదే పని, ఇంకాస్త విభిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోతో చేస్తే.? సోషల్ మీడియాలో చాలా ఐడియాలు వర్కవుట్ అవుతున్నాయి.

పబ్లిక్ టాయిలెట్లలో యూరిన్ కోసం వినియోగించేవాటిని వైఎస్ జగన్ నోరులా తయారు చేస్తున్నారు. వాటిల్లో యూరిన్ పోస్తున్నారు కూడా.!

ఎవరు చేసినా తప్పే అది.!

ఔను, ఎవరు చేసినా తప్పే అది.! రాజకీయమంటే, రాజకీయ పార్టీలు చెబుతున్న పైత్యం కాదు. రాజకీయమంటే సేవ.!

ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసమే పని చెయ్యాలి. అలాంటిది, ఆ ప్రజలే రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారి, అసాంఘీక శక్తులుగా వ్యవహరిస్తోంటే, రాజకీయం ఎవరి కోసం.?

అయినా, గొడ్డలి వేటుతో గుండె పోటు తెప్పించిన వైసీపీ మార్కు రాజకీయం.. కార్టూన్ బొమ్మలకి బాక్సింగ్ బ్యాగ్ అమర్చి నీఛ నికృష్ట రాజకీయం చేయడంలో వింతేముంది.?

Also Read: Avantika Vandanapu: వైరల్ బ్యూటీ! హాలీవుడ్‌లో తెలుగమ్మాయ్!

ఎన్నికల సీజన్ కదా.! ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పెద్దయెత్తున బహిరంగ సభలు పెట్టడం సర్వ సాధారణం.!

వైసీపీ బహిరంగ సభల్లో టీడీపీ, జనసేన అధినేతల బొమ్మల్ని పెట్టి, పైశాచికత్వం ప్రదర్శించడం చూశాం.

ఇకపై, టీడీపీ అలాగే జనసేన పెట్టబోయే బహిరంగ సభల్లో కౌంటర్ ఎటాక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఎలా వుండబోతోందో చూడబోతున్నాం.

క్రియేటివిటీ ఎవడబ్బ సొత్తూ కాదు.! పైశాచికత్వమైనా అంతే.!

Digiqole Ad

Related post