Table of Contents
God Father Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి పేరు మారడమేంటి.? అదీ, ఈ వయసులో.! వ్యవహారం కాస్త తేడాగానే వుంది కదా.?
కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన చిరంజీవి, ఎవరో చెప్పారని ‘ఆచార్య’ సినిమా ఫెయిల్యూర్ దెబ్బకి తన పేరుని మార్చుకుంటారా.?
తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ కోసం చిరంజీవి పేరు మార్చుకున్నారన్నది సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జరుగుతున్న రచ్చ.
కుహనా పండితులు తెరపైకొచ్చేశారు. అడ్డమైన విశ్లేషణలూ చేసేస్తున్నారు. గురుడంటారు.. శుక్రుడంటారు.. అవేవో దశలంటారు. సంఖ్యా శాస్త్రమట.. ఇంకోటేదోనట.!
God Father Megastar Chiranjeevi.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి..
ఇంతకీ, అసలేం జరిగింది.? ‘గాడ్ ఫాదర్’ (God Father Movie) సినిమాకి సంబంధించి ఇటీవల ఓ ఇంట్రో వీడియో వదిలారు చిత్ర నిర్మాతలు. అందులో మెగాస్టార్ స్టైలింగ్ సింప్లీ సూపర్బ్.!
అయితే, ‘గాడ్ ఫాదర్’ ఇంట్రో వీడియోలో, చిరంజీవి పేరులోని అక్షరాలు కాస్త భిన్నంగా కనిపించాయి. మామూలుగా అయితే.. చిరంజీవిని ఇంగ్లీషులో ‘CHIRANJEEVI’గా రాస్తాం.

కానీ, ఇక్కడ ‘గాడ్ ఫాదర్’ (God Father) ఇంట్రో వీడియోలో మాత్రం, ‘CHIRANJEEEVI’గా పేర్కొన్నారు. అదీ అసలు సమస్య. అదనంగా ఒక ‘E’ వచ్చి చేరిందన్నమాట చిరంజీవి పేరులో.
ఇంతకీ, ఎవరిదీ పైత్యం.?
అన్నట్టు, ‘గాడ్ ఫాదర్’ టైటిల్ పోస్టర్‌లో మాత్రం, చిరంజీవి పేరు మామూలుగానే.. అంటే, ‘CHIRANJEEVI’ అనే వుంది. దానర్థం, ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందని.
అరకొర పరిజ్ఞానం.. అదేనండీ హాఫ్ నాలెడ్జ్ వ్యవహారాలతోనే ఇలా జరుగుతుంటుంది.
అబ్బే, మా తలకాయలు బాగా బలిసిపోయాయ్.. మేమే పండితులం.. అని చెప్పుకునే కొందరు మాత్రం, పేరు మార్పు జరిగిందని ఇంకా బుకాయిస్తూనే వున్నారు.
కాస్త ఆపుకోండి.! స్పష్టత కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది..
తప్పదా.? మెగాస్టార్ చిరంజీవి స్పందించాల్సిందేనా.? మెగాస్టార్ కూర్చుంటే వింత, నిల్చుకుంటే విమర్శ.. ఇలా సాగుతోంది వ్యవహారం. సో, ఆయన వీటిని లైట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ.
ఎలాగూ, విజయదశమికి సినిమా విడుదలవుతుంది కదా.! ఈలోగా బోల్డన్ని పోస్టర్లు, బోల్డన్ని ప్రమోషనల్ వీడియోలూ వచ్చేస్తాయ్. అప్పటిదాకా ‘సుస్సు’ ఆపుకోలేనోళ్ళు, ఎలాంటి ప్రచారమైనా చేస్కోవచ్చు.!
Also Read: పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి కళ వచ్చేసిందోచ్.!
మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అసలు పేరు తెలుసు కదా.? కొణిదెల శివ శంకర వరప్రసాద్.!
ఆంజనేయుడి భక్తుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన ఆంజనేయస్వామి మాలధారణ చేస్తారు. అయ్యప్పస్వామి మాల కూడా ధరిస్తారు. భక్తి ఆయనకు కాస్త ఎక్కువే.
అలాగని, చేతికి కుప్పలు తెప్పలుగా తాళ్ళు కట్టేసుకుని, మెడలో రకరకాల దండలు వేసేసుకునే రకం కాదు.!