Alia Bhatt First Night.. ఇది తొలి రాత్రి.. కదలని రాత్రి.. అంటూ ఓ సినీ కవి మాంఛి పాటేసుకున్నాడు చాలాకాలం క్రితం. ఆ పాటని కొంత ప్రేమగా.. ఇంకొంత ఘాటుగా రాశాడా సినీ కవి.
అసలు తొలి రాత్రి అంటే ఏంటి.? ఫస్ట్ నైట్.. అని అంటుంటాం. పెళ్ళయ్యాక ఆలుమగలు శారీరకంగా కలుసుకునే రాత్రిని తొలి రాత్రి అంటాం. అద్గదీ అసలు సంగతి.
పెళ్ళయ్యాక కలుసుకునే మొదటి రాత్రికి వున్న ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ హంగామానే వేరు.
మరి, పెళ్ళికి ముందు శారీరక కలయికలు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాయి కదా.! అందుకేనేమో, పెళ్ళయ్యాక ‘తొలి రాత్రి’ అనేది జస్ట్ ఓ ‘షో’ అయిపోతోంది.
ఇది తొలి రాత్రి కాదు.. భీకర రాత్రి.!
హ్యాండ్సమ్ కుర్రాడు.. అందమైన అమ్మాయి.. కానీ, తొలి రాత్రి సజావుగా సాగలేదు. ఎందుకంటే, మనోడికి ‘కరెంటు’ సమస్య.. ఇలాంటి వార్తలు తరచూ మీడియాలో చూస్తూనే వున్నాం.
అమ్మాయే అబ్బాయి గెటప్ వేసుకుని, ఇంకో అమ్మాయిని పెళ్ళాడి.. ఆ బాగోతం, ఫస్ట్ నైట్ సమయంలో బయటపడిన సందర్భాలూ చాలానే కనిపిస్తున్నాయి.

పైకి అబ్బాయిలానే కనిపిస్తాడు. కానీ, ప్రవర్తన అమ్మాయిలా వుంటుంది.. అలా తొలి రాత్రి కాస్తా పనికిమాలిన రాత్రి అయిపోతుంటుంది కొందరు అమ్మాయిలకి.
అమ్మాయే కానీ, అబ్బాయిలా వ్యవహరించేసరికి.. ఎన్నో ఆవలు పెట్టుకున్న అబ్బాయికి తొలి రాత్రి కాళ రాత్రిగా మారిన సందర్భాలూ వున్నాయ్.
Alia Bhatt First Night.. అలియా భట్ తొలి రాత్రి సంగతేంటి.?
అసలు హెడ్డింగ్ ఏంటీ.? ఈ అసహజ తొలి రాత్రుల గోలేంటి.? అంటారా.! అసలు విషయానికొచ్చేద్దాం.. ఫస్ట్ నైట్ అనేది ఏమీ వుండదంటూ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తేల్చేసింది.
‘పెళ్ళి పనుల్లో బిజీగా వుంటాం.. కంటికి నిద్ర, శరీరానికి విశ్రాంతి లేకుండా ఎంజాయ్ చేస్తాం.. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కోసం ఓపిక ఎక్కడుంటుంది..’ అనేసింది అలియా భట్.
Also Read: అనారోగ్యమే మహా ప్రచారం.! శృతి హాసన్‌కి అసలేమైంది.?
కాఫీ విత్ కరణ్ టాక్ షో అంటేనే అంత. అక్కడ ఇలాంటి మాటలు కామన్.! తొలి రోజు అంటే అది కాదు తల్లీ.! ఆలు మగలు, ఓ మంచి ముహూర్తాన శారీరకంగా, మానసికంగా ఒక్కటవడమే తొలి రాత్రి.!
కొంత కాలంపాటు ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో సహజీవనం చేసేసి, ఆ తర్వాత పెళ్ళి చేసుకుంది కాబట్టి, ‘తొలి రాత్రి’ విషయంలో అలియాకి ఇంత తేలికైన అభిప్రాయం వుండడంలో వింతేముంది.?