Home » పెళ్ళికి ముందు ‘ఆ పని’.! చావుకి స్వాగతం పలికేలా.!

పెళ్ళికి ముందు ‘ఆ పని’.! చావుకి స్వాగతం పలికేలా.!

by hellomudra
0 comments
Pre Wedding Shoot

Pre Wedding Shoot: శుభం పలకరా.. అంటే పెళ్ళికూతురు డాష్ ఎక్కడ.? అనడిగాడట వెనకటికి ఒకడు. ఇదొక ముతక సామెత. ఈ రోజుల్లో పెళ్ళి అంటే అదో వెరీ వెరీ స్పెషల్ వేడుక. దీన్నొక ఈవెంట్‌లా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

పెళ్ళి సంగతి తర్వాత.. ముందైతే, పెళ్ళికి ముందు వ్యవహారం గురించి మాట్లాడుకోవాలి. ఇందులో పెడార్థాలేమీ లేవు. పెళ్ళికి ముందు.. అంటే, ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ గురించిన ప్రస్తావన మాత్రమేనండోయ్.

చూపులు కలిశాక.. వైవాహిక బంధంతో ఒక్కటయ్యేముందు.. అమ్మాయి, అబ్బాయి.. వెరైటీగా ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ చేయించుకోవడమనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.

ఇందుకోసం వేలల్లో కాదు, లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.

చాలా జంటలకు ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్స్ మధురానుభూతుల్ని ఇస్తున్నాయి. అయితే, ఎన్ని వైవాహిక బంధాలు.. ఏడాది కంటే ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి ఈ రోజుల్లో.. అన్నది వేరే చర్చ.

Pre Wedding Shoot మదురానుభూతులా.? మరణమృదంగమా.?

పెళ్ళి తర్వాత, వైవాహిక జీవితం సంగతి దేవుడెరుగు.! ఫొటో షూట్లతోనే కొన్ని జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి.

ప్రమాదకర ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లు ఫ్యాషన్ అయిపోయాయి. ఈ ప్యాషన్ కాస్తా, కాబోయే వధూవరుల ప్రాణాల్ని తోడేస్తున్నాయి.

Pre Wedding Shoot
Pre Wedding Shoot

సరైన రక్షణ ఏర్పాట్లు లేకుండా చెరువులు, సముద్ర తీరాలు, కొండలు.. వంటి ప్రాంతాల్లో ఫొటో షూట్లు చేయించుకుంటున్న వధూవరులు, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయ్.

కొత్తదనం కోసమంటూ ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు యువతీ యువకులు. బతికుంటే బలుసాకు తినొచ్చన్నది ఒకప్పటి మాట.. చచ్చి అయినా వార్తల్లెక్కాలన్నది నేటి మాట.. అన్నట్టు తయారైంది పరిస్థితి.

శుభం వర్సెస్ అశుభం.!

వివాహం.. ఓ అందమైన అనుబంధానికి వేదిక. దురదృష్టం.. ఆ వివాహం కంటే ముందే చావుని కొనితెచ్చుకుంటోంది నేటి యువత.

Also Read: ఇంట్లోనే వైద్య పరీక్షలా.! సొంత వైద్యం కూడానా.?

ఏదిఏమైనా ప్రాణంతో చెలగాటం నేటి యువతకు ఓ సరదా ప్రక్రియ అయిపోయింది. వాళ్ళేదో చేశారని వీళ్ళు.. వీళ్ళని చూసి ఇంకొకరు.. ఇలా తయారయ్యింది వ్యవహారం.

ప్రమాదాలకు ఆస్కారమివ్వనంతవరకు ఇలాంటి ఫొటో షూట్లు, వీడియో షూటింగ్.. (Pre Wedding Shoot) తప్పేమీ కాదు. కానీ, ప్రాణాల్ని పణంగా పెట్టేలా వెర్రితనం ప్రదర్శిస్తేనే.. అది క్షమించరాని నేరం.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group