Kangana Ranaut Dhaakad Story.. సినిమా రంగంలో హిట్లు, ఫట్లు.. ఎవరికైనా మామూలే. సూపర్ స్టార్లు సైతం ఫ్లాపులిచ్చిన సందర్భాలుంటాయ్.
అలాంటిది, కంగనా రనౌత్ నటించిన సినిమా ‘ధాకడ్’ ఫెయిలయితే, అదో పెద్ద విషయమా.?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రతిసారీ చేసే రచ్చ, ఇతర నటీనటులపై చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్లనే ‘ధాకడ్’ సినిమా ఫెయిల్యూర్ హాట్ టాపిక్ అయ్యింది.
సినిమా పరాజయం పాలైతే విమర్శించకూడదట. ‘మా సినిమాని కొందరు కావాలనే ఫెయిల్ చేయించారు..’ అంటూ కంగనా రనౌత్ తాజాగా సెలవిచ్చింది. అలాంటివాళ్ళను తాను పట్టించుకోననీ సెలవిచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
దాంతో, ‘ధాకడ్’ సినిమాని మర్చిపోయిన చాలామంది ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశా ఇంకే సినిమాకీ కనిపించని ప్రత్యేకత ఇదని అనుకోవాలేమో.
Kangana Ranaut Dhaakad Story.. కంగన అంటేనే వివాదం.!
నిజానికి, ‘ధాకడ్’ సినిమా కోసం కంగన ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేయాలో అన్నీ చేసింది. కానీ, సినిమాలో (Kangana Ranaut Dhaakad) చెత్త కంటెంట్ కారణంగా, డిజాస్టర్ అయి కూర్చుంది.

‘ధాకడ్’ (Dhaakad Film) సినిమా నిర్మాత, సినిమా కారణంగా వచ్చిన నష్టాలతో ముంబైలోని తన కార్యాలయాన్ని అమ్మేసుకున్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే, ఆ వార్తల్ని సదరు నిర్మాత ఖండించాడు కూడా.
ఇలాంటి సినిమాల (Dhaakad Movie) విషయంలో నిర్మాతలు నష్టపోరుగానీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోతారు. ఆ విషయం కంగనా రనౌత్‌కి తెలియదని అనుకోగలమా.?
Also Read: రేసుల్ పూకుట్టీని అలా‘గే’ అనుకోనివ్వండి.!
దాదాపు 80 కోట్లు ఈ సినిమాకి (Dhaakad Movie) ఖర్చు చేస్తే, 8 కోట్లు కూడా తిరిగి రాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. ఓటీటీలో కూడా ‘ధాకడ్’ సినిమాని చూసేవారు లేకపోవడం గమనార్హం.
ఏమైపోయింది కంగనా రనౌత్ (Kangana Ranaut) స్టార్‌డమ్.? అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. అయితే, కంగన మాత్రం తాను బౌన్స్ బ్యాక్ అవుతానని అంటోంది.