Suriya Achaludu.. చలుడు అనగా.. చలించేవాడు అని అట.! చలనం లేనివాడిని అచలుడు అంటారట.! అచలుడు అంటే శివుడట. అబ్బో, కథ పెద్దదే వుందే.!
ఇంతకీ, ఈ ‘అచలుడు’ సంగతేంటి.? ఇదొక సినిమా. తెలుగులోకి డబ్ అవుతున్న తమిళ సినిమా టైటిల్ ఇది. తమిళంలో ఏదో టైటిల్ పెట్టార్లెండి.. దాని గురించి మనకెందుకు.?
మొన్నామధ్య ‘ఈటి’ అనే ఓ సినిమా వచ్చింది. ‘ఎవరికీ తల వంచడు’ అనేది ఆ సినిమా టైటిల్ అట. అదే నేరుగా పెట్టేయొచ్చు కదా.? అంటే, దానికేదో వింత కథ చెప్పారు కొందరు.
Suriya Achaludu సూర్య సినిమాలకే ఎందుకు.?
అదీ, ఇదీ.. రెండూ తమిళ నటుడు సూర్య సినిమాలే కావడం గమనార్హం. సూర్యకే ఎందుకు ఇలాంటి టైటిల్స్ పెడుతుంటారు.? అన్న డౌటు మీకొస్తే అది మీ తప్పు కాదు.
నిజానికి, సూర్యకి మాత్రమే కాదు, చాలామంది తమిళ నటులకు సంబంధించి వెరైటీ టైటిళ్ళు పెట్టడం ఈ మధ్య కామన్ అయిపోయింది.
తెలుగు భాషని భ్రష్టు పట్టించేస్తున్నారంటూ తెలుగు భాషా ప్రేమికులు కొందరు ఈ డబ్బింగ్ సినిమాల టైటిళ్ళ మీద వాపోతున్నారు.
మన తెలుగు సినిమా టైటిల్స్ ఏమన్నా గొప్పగా వుంటున్నాయా.? ఆ మధ్య నానా రకాల తిట్లూ టైటిళ్ళుగా మారిపోయాయ్. ఆ పైత్యం ఇంకా కొనసాగుతూనే వుంది.
బాబోయ్.. ఇదేం ఆణిముత్యం.?
ఏదిఏమైనా, ‘అచలుడు’ అనేది ప్రస్తుతానికైతే ఓ ఆణిముత్యమే. ఆ టైటిల్‌కి అర్థమేంటి.? అంటూ జనం అంతర్జాలాన్ని.. అదేనండీ ఇంటర్నెట్‌ని తెగ వెతికేస్తున్నారు.
Also Read: కరెంటు షాక్: ఉడత ఆత్మాహుతి దాడి చేసిందటండీ.!
గూగుల్ తల్లి ఏదో చెబుతోంది.. ఆయా సెర్చ్ ఇంజిన్లు చెబుతున్న అర్థాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఏదో ఒకటి, సినిమా వస్తుంది.. వెళుతుంది. వచ్చి వెళ్ళేదాకా.. ఈ రచ్చ కొనసాగుతూనే వుంటుంది.
అన్నట్టు, తమిళ హీరో సూర్య పేరుని సరిగ్గా చదివితే, అది సూరియ అని పలకాల్సి వస్తుంది. సో, దాంతో పోల్చితే.. ‘అచలుడు’ పెద్ద వింతేమీ కాదు.