తుత్తర బ్యాచ్.! చెప్పేదాకా ఆగరేం.!
Nagachaitanya Sobhita Media Thutthara.. అక్కినేని నాగచైతన్య మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నాడట. ఈసారి కూడా సినీ నటినే పెళ్ళి చేసుకోబోతున్నాడట నాగచైతన్య.
ఆమె ఎవరో కాదు, సినీ నటి శోభిత ధూళిపాళ. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈరోజు సాయంత్రమే జరగబోతోందట. కాదు కాదు, రేపు ఉదయం.. అని కూడా అంటున్నారు.
నిజానికి, చాలాకాలంగా ఈ ఇద్దరి మధ్యా ‘ప్రేమ వ్యవహారం’ ముదిరి పాకాన పడిందన్న ప్రచారం జరుగుతూనే వుంది.
ఎవరి వ్యక్తిగత జీవితం.. వాళ్ళిష్టం కదా.!
ఇటు నాగచైతన్య, అటు శోభిత.. ఈ పుకార్లను లైట్ తీసుకున్నారు. సరే, ఎవరి వ్యక్తిగత జీవితం.. వారిష్టం.. అనుకోండి.. అది వేరే సంగతి.
కాకపోతే, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అభిమానుల్లో ఒకింత స్పెషల్ క్యూరియాసిటీ వుంటుంది కదా.. మీడియాలో గాసిప్స్‌కి ఇదే కారణం.
నేటి సాయంత్రమే ఎంగేజ్మెంట్.. కాదు కాదు, రేపే ఎంగేజ్మెంట్.. అని ప్రచారం జరుగుతున్న దరిమిలా, అధికారిక ప్రకటన ఇరువురు సినీ ప్రముఖుల నుంచీ వచ్చి వుండాల్సింది.
గోప్యత.. సాధ్యమేనా.?
పోనీ, విషయాన్ని గోప్యంగా వుంచాలనుకుంటున్నారా.? అంటే, గోప్యత అనేది సాధ్యం కాదని వాళ్ళకీ తెలుసు.
ఓ వైపు మీడియా తుత్తర.. ఇంకో వైపేమో సస్పెన్స్.. వెరసి, సోషల్ మీడియా వేదికగా రచ్చకు కారణమవుతోంది.
నాగచైతన్య – సమంత గతంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆ ఇద్దరూ విడిపోవడానికి సమంత తప్పుడు ప్రవర్తనే కారణమని అక్కినేని అభిమానులు గుస్సా అయ్యారు.
Also Read: Neha Sharma About Mobility And Weight Training.!
అదేం కాదు, తప్పంతా నాగచైతన్యదేనంటూ సమంత (Samantha Ruth Prabhu) అభిమానులు మండిపడ్డారు. ఇప్పుడు మళ్ళీ అదే రచ్చ ఇంకోసారి షురూ అయ్యింది.
పాపం సమంత.. ఇప్పుడెందుకు టార్గెట్ అవుతోంది.? ఒకవేళ సమంత గనుక, నాగచైతన్య కంటే ముందే మరో పెళ్ళికి సిద్ధమైతేనో.?