Table of Contents
Anasuya Bharadwaj Liger.. అనసూయ భరద్వాజ్.. పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో దిట్ట.. అంటుంటారు చాలామంది. అది నిజమేనని ఆమె చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది.
తాజాగా, అనసూయ ఇంకోసారి తన టైమింగ్ ప్రదర్శించింది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వొచ్చేమో కానీ, రావటం మాత్రం పక్కా..’ అంటూ ట్వీటేసింది.
నేడు ‘లైగర్’ సినిమా విడుదలైంది. అందులో హీరో విజయ్ దేవరకొండ. గతంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా సమయంలో అనసూయ వివాదాల్లోకెక్కింది.
అనసూయ ఆవేదనలో తప్పు లేదుగానీ..
నిజానికి, అనసూయ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ నోరు జారాడు. బూతు తిట్టు ప్రయోగించాడు.!
దాన్ని అనసూయ తప్పు పట్టింది. మీడియాకెక్కింది కూడా. అనసూయని ఏకి పారేశారు ‘అర్జున్ రెడ్డి’ అభిమానులు అప్పట్లో.!
అయితే, అనసూయ తక్కువేం తిన్లేదు. జబర్దస్త్ కామెడీ షోలో వచ్చిన నానా రకాల డబుల్ మీనింగ్ చెత్త డైలాగుల్నీ భరించింది, వాటిని ఎంకరేజ్ చేసింది కూడా.!
Anasuya Bharadwaj Liger ఆమె చేస్తే, అది తప్పు కాదు.!
సినిమాల్లో ఐటమ్ సాంగుల మాటేమిటి.? అంటే, అది నటన.! జనంలోకి వచ్చినప్పుడు పద్ధతిగా వుండాలన్నది అనసూయ ఉవాచ.

మరి, పద్ధతిగల వస్త్రాలే ధరిస్తున్నావా.? అంటే, దానికి ఇంకోటేదో చెబుతుంటుంది అనసూయ. ఆమె అంతే, ఎలాగైనా ట్విస్ట్ చేయగలుగుతుంది.
ఇంతకీ, ‘లైగర్’ మీదనేనా అనసూయ ‘కర్మ సిద్ధాంతాన్ని’ వల్లించింది.? అనసూయ ఎక్కడా ‘లైగర్’ పేరు ప్రస్తావించలేదు.
దీన్ని పైశాచికానందం అనొచ్చా.?
అయితే, ‘కొందరి విచారం పట్ల ఆనందించాలని లేదు..’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది అనసూయ తన ‘కర్మ’ ట్వీటుకి.!
అంత ఆనందం లేకపోతే, ఈ ట్వీటు ఎలా వేశావ్.? అని చాలామంది అనసూయని తిట్టిపోస్తున్నారు.
పలు సందర్భాల్లో అనసూయ మాట్లాడిన మాటలు, ఆమె వల్గర్ ప్రదర్శన.. ఇవన్నీ ఫొటోలు, వీడియోల రూపంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెకే నేరుగా వెళ్ళేలా పోస్ట్ చేస్తున్నారు.
Also Read: పెద్ద పేరు, అల్ప బుద్ధి.! అను‘రోగ్’ పబ్లిసిటీ తాపం.!
అన్నట్టు, ‘అర్జున్ రెడ్డి’ సమయంలో తలెత్తిన గొడవని మర్చిపోయిన అనసూయ, విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.!
ఇక, ఇటీవల అనసూయ నటించిన సినిమాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయ్. దాన్ని కూడా కర్మ ఫలితమే అనుకోవాలేమో కదా.?