Pooja Hegde Vs Sai Pallavi.. పూజా హెగ్దేకి ఉత్తమ నటి అవార్డు దక్కింది.. అదీ ‘సైమా’ పురస్కారాల్లో.! ఈ విషయమై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.!
అదేంటీ, సాయి పల్లవి (Sai Pallavi) కదా ఉత్తమ నటి.? పూజా హెగ్దేకి ఉత్తమ నటి కేటగిరీలో అవార్డు ఇవ్వడమేంటి.? అన్నది చాలామంది డౌటానుమానం.!
ఔను, అవార్డులు కొనుక్కుంటే వస్తాయ్.! ఇది చాలాకాలంగా వినిపిస్తోన్న మాట. ఇందులో కొంత నిజం లేకపోలేదు కూడా.! మరి, పూజా హెగ్దే (Pooja Hegde) అలా అవార్డుని కొనుక్కుందా.?
ఇది మరీ దారుణం.! అవార్డుల్ని కొనుక్కోవాల్సిన ఖర్మ పూజా హెగ్దేకి ఏంటి.? కాకపోతే, ‘సైమా’ లాంటి పురస్కరాలకి ఓ పద్ధతీ.. పాడూ.. వుండదు.! అదే అసలు సమస్య.
Pooja Hegde Vs Sai Pallavi.. అవార్డు వెనుక అసలు కోణం.!
ఆయా అవార్డుల ప్రదానోత్సవానికి ఎవరైతే సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం వుంటుందో, ఆ వీలు చూసుకుని మాత్రమే, విజేతల్ని ఎంపిక చేస్తుంటారు.

అద్గదీ అసలు విషయం. అయినా, అవార్డు ఇస్తామంటే, సాయి పల్లవి (Sai Pallavi) వెళ్ళకుండా వుంటుందా.? ఇక్కడ మళ్ళీ ఇంకో అంశం కీలక భూమిక పోషిస్తుంటుంది.
తమకు వచ్చిన అవార్డుని ప్రమోట్ చేసుకోగలిగే ‘స్థాయి’ కూడా ఆయా సెలబ్రిటీలకు వుండాలన్నది కొన్ని అవార్డుల విషయంలో తెరవెనుకాల వినిపించే నిబంధన. బాబోయ్, ఇవేం అవార్డులు.. అనొద్దు.. ఇవింతే.!
ఏ అవార్డు గొప్పది.?
పూజా హెగ్దే (Pooja Hegde) పలు సినిమాల్లో మంచి నటనా ప్రతిభను చూపించింది. సాయి పల్లవితో పోల్చుతూ, పూజా హెగ్దేని తక్కువ చేయలేం.
Also Read: పవన్ అభిమానుల మాల ధారణ.! వాళ్ళకి బాగా కాలినట్టుందే.!
అయినాగానీ, సాయి పల్లవికి అన్యాయం జరిగింది.. ‘సైమా’ అవార్డుల విషయంలో. నాన్సెన్స్.. ఈ అవార్డులతో నటీనటుల నటనా ప్రతిభను కొలవగలమా.?
ప్రేక్షకుల మన్ననలే అసలు సిసలు అవార్డులు. సాయి పల్లవి (Lady Power Star Sai Pallavi) లేడీ పవర్ స్టార్.! పూజా హెగ్దే (Pooja Hegde) గ్లామర్ బొమ్మ.! ఇది క్రిస్టల్ క్లియర్.!