Godfather Chiranjeevi Politics.. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో రాజకీయాల్ని వదిలేశారు. కానీ, ఆయన్ని రాజకీయాలు మాత్రం వదలడంలేదు.
బుర్ర వున్నోడు, బుర్ర లేనోడు కూడా చిరంజీవిని (Megastar Chiranjeevi) రాజకీయాల్లోకి లాగుతూనే వున్నాడు. అదే అసలు సమస్య.
కుల జాడ్యం కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. కారణం ఏదైతేనేం, మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలతో ముడిపెట్టడం అనేది ఇటీవలి కాలంలో తరచూ చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ మీదికి అస్త్రంగా..
చిరంజీవిని (Chiranjeevi) పొగడటం ద్వారా పవన్ కళ్యాణ్‌ని (Power Star Pawan Kalyan) రాజకీయంగా ఇరుకున పెట్టొచ్చని కొన్ని గ్రామ సింహాలు గత కొంతకాలంగా ప్రయత్నిస్తూనే వున్నాయ్.
ఓ పెంపుడు శునకం అయితే, మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడని విమర్శిస్తుంటుంది. ఎంగిలి బొయికె కోసం కక్కుర్తి పడే శునకమది. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.!

‘నేను రాజకీయాల్లో వున్నా, నా తమ్ముడు రాజకీయాల్లో వున్నా ఒకటే. మా ఇద్దరి లక్ష్యమూ ఒకటే. కాకపోతే మార్గాలు వేరు.. మా ఆలోచనలు వేరు..’ అని చాలాసార్లు చిరంజీవి (Godfather Chiranjeevi) స్పష్టత ఇచ్చినా, అది రాజకీయ మూర్ఖుల తలకెక్కదు.!
Godfather Chiranjeevi Politics.. రాజకీయాల్ని వదిలేసినాగానీ..
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ (Godfather) సినిమా కోసం చెప్పిన ఓ డైలాగ్ మీద పెద్ద రచ్చ షురూ అయ్యింది. ‘నేను రాజకీయాన్ని వదిలేసినా.. రాజకీయం నన్ను వదలడంలేదు..’ అన్నదే ఆ డైలాగ్ సారాంశం.
Also Read: పవన్ అభిమానుల మాల ధారణ.! వాళ్ళకి బాగా కాలినట్టుందే.!
ఇది నిజమే కదా.! ఇందులో సినిమాటిక్ అంశం ఏముంది.? చిరంజీవిని (Megastar Chiranjeevi) చూడగానే, కొన్ని డైలాగ్స్ అలా పుట్టుకొచ్చేస్తుంటాయంతే.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమో, చిరంజీవి (Mega Star Chiranjeevi) మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చినా రావొచ్చు.!
చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవాలని చాలా గ్రామ సింహాలు చాలా చాలా పాట్లు పడుతూనే వున్నాయి.