నయనతార – విఘ్నేష్ శివన్ జంట మళ్ళీ వార్తల్లోకెక్కింద. ఈ జంటకి ఇటీవలే పెళ్ళి జరిగింది.. తాజాగా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయనతార – విఘ్నేష్ శివన్. Nayanthara Vignesh Shivan.
ఇదెలా సాధ్యం.? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఇందులో వింతేముంది.? పెళ్ళికి ముందు ‘అది’ తప్పు కాదని న్యాయస్థానాలే చెబుతున్నాయ్.
పైగా, సహజీవనం కూడా నేరం కాదు.! అదంతా ఓ యెత్తు. నయనతార ఈ మధ్య ఎక్కడా బేబీ బంప్‌తో కనిపించలేదు. మరెలా ఈ జంట ఒకేసారి ఇద్దరు పిల్లలకు తల్లిందండ్రులైనట్టు.?
Nayanthara Vignesh Shivan.. సరోగసీ వుందిగా.!
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పెళ్ళికి ముందే ఈ జంట సరోగసీని ఆశ్రయించింది. ఈ జంటకి పెళ్ళయి నాలుగు నెలలే అవుతోంది. ఇంతలోనే, వీరికి ఏకంగా ఇద్దరు కవల పిల్లలు పుట్టేశారు.

తమ పిల్లలతో కలిసి వున్న ఫొటోల్ని నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చాలామంది ఈ జంటకు విషెస్ అందిస్తున్నారు.. చిన్నారులకు ఆశీస్సులూ అందిస్తున్నారు.
ట్రోలింగ్ సహజమే కదా.!
ట్రోలింగ్ సంగతంటారా.? ఈ రోజుల్లో అది లేకపోతే ‘కిక్కు’ ఏముంటుంది.? ఈ రోజుల్లో ఇదంతా సర్వసాధారణం. పెళ్ళయిన నాలుగు నెలలకే ఎలా తల్లిదండ్రులయ్యారబ్బా.? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజుల్లో ఏది తప్పు.? ఏది ఒప్పు.? అని జడ్జిమెంట్స్ పాస్ చేసే పరిస్థితి లేదు. ఎవరి గోల వారిది. ఎవరి జీవితం వాళ్ళది.!
Also Read: Anasuya Bharadwaj ‘నవస్త్ర’.. అసలు అర్థం తెలుసా.!
నయనతార – విఘ్నేష్ శివన్ చాలాకాలం పాటు ప్రేమించుకున్నారు.. కొంతకాలం సహజీవనం కూడా చేశారు. ఇటీవలే పెళ్ళిపీటలెక్కారు.! ఇంతలోనే తల్లిదండ్రులయ్యారు.
జాక్ పాట్ అంటే ఇదే మరి.! ఎందుకంటే, కవలలిద్దరూ అబ్బాయిలే.! మరి, జూనియర్ నయనతార (Nayanthara) మాటేమిటి.? ఏమో, నెక్స్‌ట్ ఆ గుడ్ న్యూస్ ఈ జంట చెబుతుందేమో.!