Tamannaah Bhatia.. ఔను కదా, పిల్లల్ని కనడానికి పెళ్ళితో పనేంటి.? అసలైతే, మగాడిక ఆడదానితో పనిలేదు.. ఆడదానికి మగాడితోనూ పనిలేదు.! ఎవరికీ ఎవరితోనూ పనిలేకుండానే పిల్లల్ని కనేయొచ్చు.!
సింగిల్ పేరెంట్స్.! ఈ మధ్య తరచూ వింటున్నమాట. సరోగసీ పుణ్యమా అని ఈ సింగిల్ పేరెంట్స్ ఎక్కువైపోతున్నారు దేశంలో.!
ట్రెండ్ మారింది.! నయనతార – విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి ఐదు నెలల క్రితం జరిగితే, ఇప్పుడారికి కవల పిల్లలున్నారు. అదెలా సాధ్యం.? అంటే, దానికి భిన్న వాదనలు వినిపిస్తున్నాయ్.
Tamannaah Bhatia.. పెళ్ళి, పిల్లలు.. తమన్నా ఏం చెప్పిందంటే..
ఇంతకీ పెళ్ళెప్పుడు.? అనడిగితే, పెళ్ళి చేసుకోవాలనుంది.. పిల్లల్ని కనాలనుంది.. కానీ, ప్రస్తుతం నటిగా కెరీర్‌లో బిజీగా వున్నానంటూ సమాధానమిచ్చింది.
అంతే, ‘పెళ్ళి కాకుండానే తల్లినవుతా’ అని తమన్నా చెప్పిందంటూ గాలి వార్తలు పుట్టుకొచ్చేశాయ్. పెళ్ళీడు వచ్చేయడమేంటి.? అదెప్పుడో వెళ్ళిపోయింది కూడా తమన్నా విషయంలో.!

అయినాగానీ, పెళ్ళికి ఇంకా సమయం వుందని తమన్నా చెబుతోంది. పెళ్ళి అనేది ఆమె ఇస్టం. ఇందులో ఎవరూ ఆమెని బలవంత పెట్టలేరు.
కానీ, తమన్నా భాటియా (Tamannaah) ప్రముఖ సినీ నటి.. ఆమె వైవాహిక జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఆమె అభిమానులకీ వుంటుంది.. అందుకే మీడియా కూడా అలాంటి ప్రశ్నల్ని వేస్తుంటుంది.
సరోగసీ.. సెలబ్రిటీలు దుర్వినియోగం చేస్తున్నారా.?
ఎక్కువగా సరోగసీని సెలబ్రిటీలే వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మగ పిల్లల కోసం సరోగసీని ఆశ్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి.
Also Read: Samantha Ruth Prabhu.. ఆ నిగూడార్ధం ఏంటి.?
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. నయనతార (Nayanthara) – విఘ్నేష్ శివన్‌ల (Vignesh Shivan) సరోగసీ వ్యవహారంపై విచారణ చేపడతామంటూ తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రోజులు మారాయ్.! సెలబ్రిటీలు అందుబాటులో వున్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నారంతే. సహజీవనం నేరం కాదు.. పెళ్ళికి ముందు శృంగారం విషయంలోనూ అభ్యంతరాల్లేవ్.!
సో, పెళ్ళికీ.. పిల్లల్ని కనడానికీ సంబంధమేముంది.? అంతే, అలా సర్దుకుపోవాలంతే.!