Rishi Sunak.. బహుశా ఎవరూ ఇది ఊహించి వుండరేమో.! భారత మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవగలరని ఎలా ఊహిస్తాం.? ఛాన్సే లేదు.!
‘ఇటలీ బొమ్మ, భారతదేశాన్ని పరిపాలించడమేంటి.?’ అని ప్రశ్నించిన ఘనత మనది. కానీ, మనోళ్ళు ప్రపంచాన్ని ఏలాలన్న భావన మనలో బలంగా వుంటుంది.
మనం పీడించబడినవాళ్ళం. బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడి, స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. ఎన్నో వందల, వేల, లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి స్వాతంత్రోద్యమంలో.!
Rishi Sunak.. బ్రిటన్ని పాలించనున్న భారతీయుడు.!
నిజానికి, రిషి సునాక్ భారతీయుడు కాదు. భారత సంతతికి చెందిన వ్యక్తి మాత్రమే. స్వాతంత్ర్యానికి పూర్వమే, రిషి సునాక్ పూర్వీకులు, విదేశాలకు వలస వెళ్ళారు.
రిషి సునాక్ తండ్రి కూడా విదేశాల్లోనే జన్మించారు. సో, భారత మూలాలున్న వ్యక్తి తప్ప, రిషి సునాక్ మన భారతీయుడు కాదు. అయినాగానీ, ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ సందర్భమిది.

వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి, పరిపాలన పేరుతో భారతీయుల్ని పీడించుకు తినేసింది బ్రిటిష్ అహంకారం. స్వాతంత్ర్య సమరయోధుల రక్తాన్ని ఏరులై పారించింది తెల్ల దొరల దాష్టీకం.
ఇప్పుడు ఆ బ్రిటిష్ నేల మీద.. మన భారత మూలాలున్న వ్యక్తి, ప్రధానిగా ఆ దేశాన్ని పరిపాలించడమంటే.. అంతకన్నా గొప్ప విషయం, గర్వపడే విషయం భారతీయులకు ఇంకేముంటుంది.?
Also Read: సిద్ శ్రీరామ్.! తెగులు పాటకి ‘నువ్వుళ్టే’ ఆ కిక్కే వేరప్పా.!
వస్తుంది.. ఏదో ఒక రోజు ప్రపంచాన్ని భారతదేశం శాసించే పరిస్థితి వస్తుంది.! కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను అందించగలిగాం.!
ఏం, ప్రపంచ దేశాలకు అవసరమైతే పెద్దన్న పాత్ర పోషించలేమా.? పోషించగలుగుతాం.! అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే. పలు దేశాల్లో భారతీయులు కీలక పదవులు నిర్వహిస్తున్నారు.. అక్కడి ప్రభుత్వాల్లో.!
చివరగా.. బ్రిటన్ ప్రధానిగా రిషి సనాక్ ఎన్నికలవడం భారతీయులందరికీ గర్వకారణమే. కానీ, బ్రిటన్లో ఇప్పటికీ రాచరికమే రాజ్యమేలుతోంది. ఆ లెక్కన బ్రిటన్ ప్రధానిగా రిషి సనాక్ ‘బలం’ ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.!