Telugu Girls Shoplift America.. అమెరికాలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఓ స్టోర్‌లో దొంగతనానికి పాల్పడ్డారట.! ఇదేదో జాతీయ సమస్య అన్నట్లుగా కథ మారిపోయింది.!
దొంగతనానికి పాల్పడ్డ ఆ ఇద్దరు అమ్మాయిల్నీ అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటిసారి కాదు, రెండోసారి దొంగతనానికి పాల్పడి దొరికిపోయారట.!
అరరె.! ఇప్పుడెలా.? ఏముంది.? అక్కడి చట్టాల ప్రకారం జైలు శిక్షో.. జరీమానానో.. విధించి వదిలేస్తారు. దేశం విడిచి పొమ్మంటే, పోవాల్సిందే మరి.!
Telugu Girls Shoplift America.. మన దేశంలో దొంగల సంగతేంటి.?
నేరము.. శిక్ష.! ఇక్కడ, మన దేశంలో వున్నట్లుండదు కదా అక్కడ కథ.! ఇక్కడైతే, లక్షల కోట్లు కొట్టేసి, అధికార పీఠాలెక్కేస్తుంటారు రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా.!
అంతేనా, హత్యలు చేసినోళ్ళు కూడా సిగ్గూ ఎగ్గూ లేకుండా చట్ట సభలకు వెళ్ళిపోతుంటారు.! చిన్న నేరం.. అదీ ఓ స్టోర్‌లో దొంగతనం. మన తెగులు మీడియా ఈ దొంగతనానికే నెత్తీ నోరూ బాదేసుకుంటోంది.
‘దొంగతనం చేయాలనిపించడం ఓ రోగం. ఆ మానసిక రోగానికి చికిత్స అవసరం..’ అంటూ మానసిక వైద్య నిపుణులతో మన తెలుగు మీడియా డిస్కషన్లు కూడా పెట్టేసిందండోయ్.!
ఎంత మాట.? ఆ తెగులు మీడియా, తాము ఎవరికైతే అమ్ముడుపోయామో.. ఆ దొంగల మీద డిస్కషన్లు పెడుతుందా.? ఛాన్సే లేదు.! అలా చేస్తే, పేమెంట్లు ఆగిపోవూ.!
నేరము.. శిక్ష.. తప్పదు..!
తప్పే.! అమెరికా వెళ్ళి దొంగతనాలకి పాల్పడటం నేరమే.! కాదని ఎవరన్నారు.? ఆ నేరానికి శిక్ష పడుతుంది కదా.!
అమెరికాలో మన పరువు తీసేసిన, తెలుగమ్మాయిలంటూ అంత ప్రచారం, ఆ దొంగతనానికి మన తెలుగు నేలపై అవసరమా.?
కాదేదీ, సంచలనానికి అనర్హం.! ఇది తెగులు మీడియా.! తెగులు పట్టిన జర్నలిజం.. ఇదిగో ఇలాగే తగలడుతుంది మరి.!