చిరంజీవి ఆత్మ కథ.! యండమూరి కలం ‘పోటు’.!

 చిరంజీవి ఆత్మ కథ.! యండమూరి కలం ‘పోటు’.!

Mega Star Chiranjeevi Gang Leader

Megastar Chiranjeevi Biography.. యండమూరి వీరేంద్రనాథ్.. పరిచయం అక్కర్లేని పేరిది.! మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని శిఖరం.!

ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పలు హిట్ సినిమాలొచ్చాయ్.! వ్యక్తిగతంగా మెగాస్టార్ చిరంజీవికి, యండమూరి వీరేంద్రనాథ్ అత్యంత సన్నిహితుడు.!

అయితే, సన్నిహితుల వెన్నుపోట్లు మెగాస్టార్ చిరంజీవికి కొత్తేమీ కాదు.! తిన్నింటి వాసాలు లెక్కెట్టడం చిరంజీవి సన్నిహితులుగా చెప్పబడే చాలామందికి అలవాటే.!

Megastar Chiranjeevi Biography.. రామ్‌చరణ్‌ని తూలనాడిన యండమూరి..

యండమూరి వీరేంద్రనాథ్ ఓ సందర్భంలో, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు.

అంతేనా, హీరోగా పనికిరాడనే అర్థం వచ్చేలా యండమూరి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.!

అది గతం.! ఇప్పుడో.! మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి.!

యండమూరి వీరేంద్రనాథ్ అంచనాలు తప్పాయ్.! రామ్ చరణ్ సినీ రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు.!

‘చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కాదు.. రామ్ చరణ్ తండ్రిని నేను.. నేను చిరంజీవిని..’ అంటూ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకున్నారు.. పుత్రోత్సాహంతో.!

చిరంజీవి ఆత్మ కథ..

అసలు ఇప్పుడిదంతా ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి తన ఆత్మ కథ గురించి తాజాగా ప్రస్తావించారు.

చిరంజీవి ఆత్మ కథని యండమూరి వీరేంద్రనాథ్ రాయబోతున్నారట.! యండమూరి వీరేంద్రనాథ్ లాంటి స్టార్ రైటర్ తన ఆత్మ కథను రాస్తే బావుంటుందని చిరంజీవి వ్యాఖ్యానించారు.

Chiranjeevi Biography Ram Charan

సో.. చిరంజీవి కోరిక మేరకు, యండమూరి వీరేంద్రనాథ్, ‘మెగాస్టార్ చిరంజీవి’ ఆత్మ కథని రాయబోతున్నారన్నమాట.!

ఆ ఆత్మ కథలో యండమూరి వీరేంద్రనాథ్ ఏం రాయబోతున్నారు రామ్ చరణ్ గురించి.? చిరంజీవి మనసులో మాటనే కదా రాయాలి.? దానికి, యండమూరి ‘కలం’ అంగీకరిస్తుందా.?

ఆ కలం విషం చిమ్ముతుందా.?

షరామామూలుగానే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద, యండమూరి కలం ‘పోటు’ విషం చిమ్ముతుందేమోనన్న అనుమానాలైతే మెగాభిమానుల్లో వ్యక్తమవడం సహజమే.!

చిరంజీవి భోళా శంకరుడు.! ఇది అందరికీ తెలిసిన విషయమే.! ఆ భోళాతనాన్ని అడ్డం పెట్టుకుని, వెకిలి వేషాలు వేసేవాళ్ళకి.. కాలమే తగిన సమాధానం చెప్తుంది.!

Also Read: స్వర్గీయ ఎన్టీయార్‌ని మళ్లీ మళ్ళీ చంపేస్తున్నారు.!

యండమూరి వీరేంద్రనాథ్‌కీ.. ఆ పైత్యం దిగిపోయే రోజు వచ్చినట్టే.!

రామ్ చరణ్ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన యండమూరి, ఇప్పడిక ఆ రామ్ చరణ్ ఘనతల్ని చిరంజీవి ఆత్మ కథలో అందమైన అక్షరాలతో లిఖించాల్సిందే.!

కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు.! ఎనీ డౌట్స్.?

Digiqole Ad

Related post