Ram Gopal Varma.. సినిమా భ్రష్టత్వం.. అని చెప్పుకోవాలంటే, దానికి ఆద్యుడు రామ్ గోపాల్ వర్మ.! ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటి.? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటి.?
అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అంటే ‘శివ’.! ఇప్పడు రామ్ గోపాల్ వర్మ అంటే అబ్బో.. అదో ప్రేతాత్మ కథ.!
ఎవరి మీద కక్ష పెంచుకుని వర్మ సినిమాలు చేస్తున్నాడోగానీ, ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం. తీసిన సినిమాలు తీసినట్టే గల్లంతవుతున్నాయ్.
అయినా, వర్మ మాత్రం ప్రేక్షకులపై దాడి ఆపడంలేదు. తాజాగా, ‘వ్యూహం’, ‘శపథం’ అంటూ తెలుగు ప్రేక్షకుల మీద దాడికి సిద్ధమవుతున్నాడట వర్మ.
Ram Gopal Varma.. బాబోయ్ ఎందుకీ ఆణిముత్యాలు.?
ఓ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’, ‘ఓ వంగవీటి’, ‘ఓ పవర్ స్టార్’, ‘ఓ అమ్మ రాజ్యంలో..’ ఇలా వర్మ సినిమా భ్రష్టత్వం గురించి విన్నాం. చూసేంత సాహసం అయితే చాలామంది చేయలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఇప్పుడు తెరకెక్కించనున్న ‘వ్యూహం’, ‘శపథం’ కూడా అలాంటి భ్రష్టత్వాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వర్మకి ఫాలోవర్స్ ఎక్కువ.!
నిజానికి, వాళ్ళంతా వర్మ అభిమానులు కాదు.. వర్మ కొందర్ని టార్గెట్ చేసుకుంటాడు కదా.. ఆ టార్గెటెడ్ ప్రముఖుల్ని ట్రోల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళే వర్మ అభిమానులు.!
ఎవరి మెప్పు పొందడానికి.?
వర్మ సినిమాలు తీసేది కూడా ఇలాంటి వాళ్ళ కోసమే.! చిత్రమేంటంటే, సోషల్ మీడియాలో వర్మని ఎంకరేజ్ చేసేవాళ్ళు, వర్మ సినిమాల్ని మాత్రం పట్టించుకోరు.
Also Read: Rakul Preet Singh.. ఔను, ఆ ‘టచ్’లో చాలా తేడా.!
ఆయా పార్టీలు వర్మని పెంచి పోషిస్తాయా.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. ‘ఎవరి మాటా వినను.. అంతా నా ఇష్టం’ అని వర్మ చెబుతాడుగానీ, ‘కొందరి’ ఇష్ట ప్రకారమే వర్మ నడచుకోవాలి. వేరే దారి లేదాయనకి.!
అందుకే, ఆయన్నుంచి ‘వ్యూహం’, ‘శపథం’ రాబోతున్నాయ్.