Vishwak Sen Laila Review: లైలా సమీక్ష.! పరమ చెత్తలా.!

 Vishwak Sen Laila Review: లైలా సమీక్ష.! పరమ చెత్తలా.!

Vishwak Sen Laila Review

Vishwak Sen Laila Review.. సినిమా ఫర్లేదు కదా.! వెయ్యి కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటోన్న ఓ పెద్ద సినిమా కంటే, బెటర్ కదా.!

దాదాపు మూడు వేల కోట్లు వసూలు చేసిన సినిమా.. అని ప్రచారం చేసుకుంటున్న సినిమా కంటే బానే వుంది కదా.!

ఇలాంటి మాటలు అక్కడక్కడా వినిపించాయి విశ్వక్ సేన్ తాజా సినిమా ‘లైలా’ గురించి.!

సోకాల్డ్ పెద్ద సినిమాల్లోని చెత్త కంటెంట్, ఆ సినిమాల చుట్టూ నడిచిన ఫేక్ వసూళ్ళ ప్రచారాల నేపథ్యంలో అలా అనిపించి వుండొచ్చేమో కొందరికి.!

అసలు విషయంలోకి వచ్చేస్తే, విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించిన సినిమా లైలా.! ఆకాంక్ష హీరోయిన్. ప్రమోషన్స్ గట్టిగానే నడిచాయ్.!

Vishwak Sen Laila Review.. నస బాబోయ్..

థియేటర్లలోకి సినిమా వచ్చింది.! తొలి రోజే సినిమా చూడటం కూడా జరిగింది.! సినిమా స్టార్ట్ అవుతూనే, ‘నస’.! చాలా సినిమాల విషయంలో ఈ మధ్య ఇదే జరుగుతోంది. ‘లైలా’ కూడా అంతే.

సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి.. అలా వెళ్ళిపోతున్నాయి. ఇంటర్వెల్ వచ్చింది.. చిన్న బ్రేక్.! మళ్ళీ అదే నస.! సినిమా ముగిసింది. ఎలా వుంది సినిమా.? అని సాహసించడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు.

ఇంటర్వెల్ సమయంలో అయితే, ‘చెత్త సినిమా.. పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు తెలుసా.. అదీ ఎక్కువే..’ అని జనం చర్చించుకోవడం కనిపించింది.

మరీ అంత చెత్తనా.? విశ్వక్ సేన్ బాగా చెయ్యలేదా.? ఆకాంక్ష గ్లామర్ బాగానే పండించింది కదా.! అభిమన్యు సింగ్ కామెడీ సంగతేంటి.? పృధ్వీరాజ్ కూడా వున్నాడు కదా.. ఇలా దేన్నీ ప్రస్తావించుకోవాల్సిన పనే లేదు.

బ్యూటీ పార్లర్ నడిపే సోనూ మోడల్, అనుకోని పరిస్థితుల్లో లేడీ గెటప్పేసి.. సమస్యల నుంచి గట్టెక్కుతాడు.! ఇదే మొత్తం కథ.! లేడీ గెటప్ సరిగ్గా సెట్ అవలేదు.!

హీరోయిన్ చాలా ఛండాలంగా పాటల్లో అంగాంగ ప్రదర్శన చేసేసింది. నటీనటుల్లో ఒకర్ని మించిన ఓవరాక్షన్ ఇంకొకరు చేశారు. ఓవరాక్షన్ కేటగిరీలో అవార్డులిస్తే, అందరికీ వచ్చేస్తాయ్.

పాటల్లో సంగీతం సోసో.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సరిగ్గా కట్ చేస్తే, గంట సినిమా కూడా మిగలదేమో.! అంత నస.

డైలాగ్స్ కూడా పేలలేదు. బూతు డైలాగులు.. వాటికి సోషల్ మీడియా మార్కు ట్రీట్మెంట్లు.. పరమ చెత్తగా వుంది డైలాగుల వ్యవహారం.

కామెడీ అనుకుని ఏవేవో సీన్స్ తీశారు.! కొత్త పేరు ఏదన్నా పెట్టాలి ఈ జోనర్‌కి. బత్తాయిల కామెడీ అయితే పరమ ఛండాలం.!

హీరో – హీరోయిన్ మధ్య ముద్దు మామూలే.! కానీ, లేడీ గెటప్పులో వున్న హీరో, కామెడీ విలన్‌గాడికి లిప్ లాక్ ఏంటో. అదీ హీరోయిన్ వుండగానే.!

చెప్పుకుంటూ పోతే, ఈ ‘లైలా’ ఛండాలానికి హద్దూ అదుపూ వుండదు. సమీక్ష ఇంత రూత్‌లెస్‌గా వుందేంటీ.. అనుకునేరు.! వన్ టూ టెన్.. అని ఇచ్చుకుంటూ పోతే, క్షమించేసి పాలిష్డ్‌గా రాసింది మాత్రమే.!

ఒక్కటి మాత్రం నిజం.. మొదట్లో ప్రస్తావించుకున్నట్లుగానే.. కొన్ని పెద్ద పబ్లిసిటీ సినిమాలతో పోల్చితే, ‘లైలా’ టార్చర్ కొంచెం తక్కువే సుమీ.!

చెప్పడం మరచితిని.. ఈ సినిమాలో ‘కల్తీ వంట నూనె’ వ్యవహారమొకటి వుంది. అదో చెత్త ఎపిసోడ్.! దాని చుట్టూనే ట్విస్టు.! మరో ‘అతి’ ఏంటంటే, యూ ట్యూబ్ అతిగాడైన సునిశిత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు.

‘లైలా’ ఎంత చెత్త సినిమానో చెప్పడానికి, ఈ సినిమాలో సునిశిత్ వున్నాడని ప్రస్తావిస్తే సరిపోద్దేమో.!

Digiqole Ad

Related post