ఔను కదా, జీవితంలో అన్ని రకాలూ తినకూడదు.. ఏదో ఒకే ఒక్క డిష్ తినాల్సిన పరిస్థితి వస్తే.? ఈ ప్రశ్న Sonal Chauhan తనకు తాను వేసుకుంటూ, అందర్నీ అడిగింది సోషల్ మీడియా వేదికగా.
చక్కనమ్మ ఏం చెప్పినా సక్కగానే వుంటుందనుకుని.. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేశారు.. అదీ సోషల్ మీడియా వేదికగానే.!
కొందరికి జీవితాంతం చికెన్ వుంటే చాలు.! కొందరికి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అయితే సూపర్.! కొందరు చపాతీ, కొందరు రోటీ.. ఇలా ఏవేవో చెప్పేశారు.
Sonal Chauhan ఇంతకీ, ఆమెకి ఏదైతే బెస్ట్.?
స్టన్నింగ్ బ్యూటీ సోనాల్ చౌహన్ మాత్రం తనకు ఛోలె భాతూర్ వుంటే చాలంటోంది. ఇది టిపికల్ పంజాబీ ఫుడ్.! పూరి, దాంతోపాటు వెస్ కర్రీస్.. కొన్ని చోట్ల దీనికి లస్సీని కూడా యాడ్ చేస్తారట.

కర్రీ అంటే ఆషామాషీ కర్రీ కాదండోయ్.. ఛోళే మసాలా.! నోరూరుతోంది కదా.! నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే, చాలా చాలా బలవర్ధకమైన ఆహారం అని అంటారు. అందులో నిజం లేకపోలేదు కూడా.!
బహుశా ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్లేనేమో సోనాల్ చౌహన్ ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా వుంటుంది.!
Also Read: Malaika Arora.. య్యెస్సూ.! తుస్సూ.! పబ్లిసిటీ స్టంట్సూ.!
ఏదో ఫన్ నోట్లో సోనాల్ చౌహన్, సోషల్ మీడియా వేదికగా ఈ ప్రశ్న వేసిందిగానీ.. ఒక్కసారి మనల్ని మనం ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి.? అన్నదానిపై ముందే ప్రిపేర్ అయితే మంచిది.
సమతుల ఆహారం వల్ల ఆరోగ్యంగా వుండొచ్చు. ఆరోగ్యంగా వుండటమంటే, అందంగా వున్నట్టే కదా.!