Ustaad Bhagat Singh.. టైటిల్ కొంచెం మారింది.! కాంబినేషన్ మాత్రం అదే. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గతంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్ అనౌన్స్ చేసింది.
అయితే, ఇప్పుడు ఆ టైటిల్ (Bhavadeeyudu Bhagat Singh) కాస్తా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యింది. భవదీయుడు ఎందుకు తీసేశారు.? ఉస్తాద్ ఎందుకొచ్చాడు.? ఇలా చాలా డౌటానుమానాలున్నాయ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో.
ఏమోగానీ, ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రానుండడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Ustaad Bhagat Singh.. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కే వేరప్పా.!
హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఆ కిక్కే వేరప్పా.! ఎందుకంటే, ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాలో కొత్త పవన్ కళ్యాణ్‌ని చూపించాడు హరీష్ శంకర్.

అందుకే, ఇంకోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. మధ్యలో రీమేక్ అన్న అనుమానాలే కొంత ఇబ్బందికరంగా మారాయ్.
‘మాకొద్దీ రీమేక్..’ అంటూ పవన్ అభిమానులే సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ ట్రెండింగ్ చేశారు. కథ, ప్రేక్షకుల్ని అలరించేలా చెప్పగలిగితే.. అది రీమేక్ అయితే ఏంటి.? స్ట్రెయిట్ కథ అయితే ఏంటి.?
వేగం ముఖ్యం..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్నారు. 2024 ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. ఈలోగానే తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయ్.
మరి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సమయం ఎక్కడ దొరుకుతుంది.? ఏమో, ఈ విషయమై హరీష్ – పవన్ మధ్య ఎలాంటి చర్చ జరిగిందో.. ఇద్దరూ ఎలాంటి కంక్లూజన్‌కి వచ్చారో.!
Also Read: ‘పసుపు’ని చూస్తే ఐశ్వర్యకి భయం.! ఎందుకో తెలుసా.?
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాని క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో చేస్తున్న పవన్, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి కమిట్ అయ్యాడు.
ఇంకోటి సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందే సినిమా.!