Super Star Krishna Biopic.. నందమూరి బాలకృష్ణ దెబ్బ కొట్టడమేంటి.? మహేష్‌బాబు భయపడటమేంటి.? అసలు ఈ ఇద్దరికీ లింకేంటి.?
తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి (Mega Star Chiranjeevi), బాలకృష్ణ నాగార్జున (Akkineni Nagarjuna), వెంకటేష్.. ఈ నలుగురు అగ్ర హీరోలు.
ఆ తర్వాతి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్ తదితరుల గురించి చెప్పుకోవాల్సి వుంటుంది.
రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్.. వీళ్ళది ఇంకో తరం.! ఇంకొంతమంది యంగ్ హీరోలూ స్టార్లుగా ఓ వెలుగు వెలుగుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఒకప్పుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావుకీ, సూపర్ స్టార్ కృష్ణకీ గట్టి పోటీ వుండేది. కమర్షియల్ సినిమాల ఒరవడిలో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
నందమూరి తారకరాముడి బయోపిక్.!
ఆ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) తనయుడు బాలకృష్ణ అయితే, ఆ కృష్ణ తనయుడు మహేష్. నందమూరి తారకరమారావు మీద పలు బయోపిక్స్ వచ్చాయి. అందులో వర్మ తీసిందొకటి.

ఇంకోటి, స్వయానా నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన బయోపిక్. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా ఎన్టీయార్ బయోపిక్‌ని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపొందించారు.
క్రిష్ ఈ బయోపిక్‌కి (రెండు భాగాలకీ) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
బాలకృష్ణ రూపొందించిన ‘ఎన్టీయార్ బయోపిక్’ (NTR Biopic) ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Super Star Krishna Biopic.. భయపడ్డాడు మహేష్.!
బహుశా, ఆ భయంతోనే తన తండ్రి కృష్ణ బయోపిక్ అంటూ ఎవరైనా తెరకెక్కిస్తే, అందులో తాను నటించబోనని తేల్చి చెప్పేశాడు సూపర్ స్టార్ మహేష్.
ఎవరైనా నటిస్తే మాత్రం, ఆ సినిమాని తాను నిర్మిస్తానని మహేష్ చెప్పడం గమనార్హం. ఇంకెవరైనా నటించి, నిర్మించినా.. తాను ఆ సినిమాని ఎంజాయ్ చేస్తానని మహేష్ చెప్పుకొచ్చాడు.
Also Read: పబ్బుకెళ్లి బజ్జీలు తినకూడదా అధ్యక్షా.?
అద్గదీ అసలు సంగతి. మహేష్‌బాబు (Super Star Maheshbabu) తెలివైనోడే.! బాలకృష్ణ ‘ఎన్టీయార్ బయోపిక్’ పేరుతో కొట్టిన దెబ్బ.. తిన్న దెబ్బ.. వీటిని మహేష్ పరిగణనలోకి తీసుకున్నాడనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.