Urfi Javed Kangana Ranaut.. ఆమె ఎవరో ఉర్ఫి జావెద్ అట.! ఇంకొకామె కంగనా రనౌత్.! ఇద్దరి మధ్యా గ్లామర్ రచ్చ.. కాదు కాదు, వల్గర్ రచ్చ జరుగుతోంది. నిజానికి, ఈ విషయంలో కంగన తప్పేమీ లేదు ప్రస్తుతానికి.
ఉర్ఫి జావెద్ (Urfi Javed) అంటే సోషల్ మీడియా సెన్సేషన్. బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా సందడి చేసింది. సెల్ఫ్ డిజైనింగ్ చేసుకుంటుంది కాస్ట్యూమ్స్‌కి.!
కాస్ట్యూమ్స్ అంటారా వాటిని.? గుడ్డ పీలకలని అనడం కూడా కష్టమే. ఏ వస్తువు దొరికితే దాంతో కాస్ట్యూమ్ డిజైన్ చేసేస్తుంటుంది.
తన శరీరంపై బట్టలతో పనిలేదామెకి. ఏదన్నా చిత్త కాగితం దొరికితే, దాన్ని నాలుగైదు ముక్కలు చేసి, ప్రైవేటు పార్ట్స్‌కి అంటించుకుని.. అదే కాస్ట్యూమ్.. అదే ఫ్యాషన్ అని చెబుతుంటుంది ఉర్ఫి జావెద్ (Urfi Javed).
కంగనా ఎందుకొచ్చింది.?
నిజానికి, ఈ విషయంలో ఇంతవరకు కంగనా రనౌత్ ప్రమేయం ఏమీ లేదు. ఉర్పి జావెద్‌పై ఓ రాజకీయ నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదు చేసిన మహిళా నాయకురాలు బీజేపీకి చెందిన వ్యక్తి. అద్గదీ అసలు సంగతి. ఉర్ఫి జావెద్ (Urfi Javed) వల్ల సమాజం చెడిపోతోందన్నది ఆమె ఆరోపణ.
బీజేపీకి సపోర్ట్ చేసే కంగనా రనౌత్ (Kangana Ranaut) వల్గర్‌గా కనిపిస్తే తప్పులేదుగానీ, ఉర్ఫి మీద విరుచుకుపడతారా.? అంటూ సదరు మహిళా నాయకురాలిపై ఉర్ఫి జావెద్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.
అన్నట్టు, ఉర్ఫి జావెద్ కూడా, ‘నేను బీజేపీలో చేరిపోయి, నీకు మంచి స్నేహితురాలినైపోతా.. అప్పడు నా మీద ఎలాంటి కేసులూ వుండవ్ కదా.? అప్పుడు నేనెంత వల్గర్‌గా కనిపించినా తప్పుండదు..’ అని ట్వీటేసింది.
Urfi Javed Kangana Ranaut ఏది గ్లామరు.? ఏది వల్గరు.?
అందాల భామలు అతి తెలివిగా, ‘చూసేవాళ్ళ కళ్ళల్లో తప్ప.. మాలో ఎలాంటి వల్గారిటీ వుండదు’ అని చెబుతారు.
కంగనా రనౌత్ (Kangana Ranaut) లాంటి అందాల భామలు ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పారు. ఇంతకీ, ఏది వల్గరు.? ఏది గ్లామరు.?
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ (Kangana Ranaut) తెరపై చేసిన అందాల ఛండాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉర్ఫి చేస్తున్నదీ ఛండాలమే.! కాకపోతే, అది ఛండాలమని నిరూపించేదెలా.?