Vijay Varasudu ఇసుక.. ఇటుక.. అంటూ ఓ ఫిమేల్ క్యారెక్టర్ ఏదో డైలాగ్ చెప్పింది. రిచ్ అప్పీల్.. మాస్ ఫైట్స్.. వెరసి, అంతా ఓ ప్యాకేజీ.!
ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ‘వారిసు’ సినిమాపై తమిళనాట ఎలాంటి అంచనాలున్నాయోగానీ, తెలుగునాట ‘దిల్’ రాజు అతి కారణంగా, విపరీతమైన హంగామా నడుస్తోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్ట్రెయిట్ సినిమాలకు పోటీగా, డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ని తెలుగు ప్రేక్షకుల నెత్తిన ఈ సంక్రాంతికి బలవంతంగా రుద్దుతోన్న విషయం విదితమే.
విజయ్.. ఈసారి గట్టిగా కొడతాడా.?
నిజానికి, సంక్రాంతికి ఇలాంటి సినిమాలు బాగానే ఆడేస్తాయ్. ట్రైలర్ చూస్తే కంటెంట్ అలా అనిపించింది. నవదీప్ హీరోగా వచ్చిన ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమా దగ్గర్నుంచి, చాలానే పోలికలు కనిపిస్తాయ్.

‘మహర్షి’, ‘అజ్ఞాతవాసి’ తదితర సినిమాలు ఈ ‘వారసుడు’ ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకు గుర్తుకొస్తే, అది మీ తప్పు కానే కాదు.!
ట్రైలర్ చూసి, సినిమా ఎలా వుందో డిసైడ్ చేసెయ్యగలమా.? కష్టమే. కానీ, కంటెంట్ ఏం వుంటుందో అంచనా వెయ్యగలం.
Vijay Varasudu మరీ అలా ఎలా దించేశాడబ్బా.?
‘వారసుడు’ ట్రైలర్లో కనిపించిన సీన్స్ దాదాపుగా అంతకు ముందు ఏదో సినిమాలో చూసినట్టే వున్నాయ్. విజయ్ – రష్మిక మధ్య ‘రంజితమే’ పాట ఒక్కటీ మాత్రం మంచి ఊపు తెస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్స్టాపబుల్.! ఈ మొరుగుడేల.?
అన్నట్టు, ఈ సంక్రాంతికి అజిత్ ‘తెగింపు’ కూడా వస్తోంది. తమిళంలో దీని పేరు ‘తునివు’.
‘తెగింపు’ ప్రోమో కూడా ఏమంత ఆకట్టుకోలేదు. కానీ, తమిళనాట.. ఈ రెండు సినిమాలు డిస్టింక్షన్లో పాస్ అయిపోయే అవకాశాలున్నాయ్.
తెలుగులో ఏమవుతుందో వేచి చూడాల్సిందే.