Waltair Veerayya.. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్.
బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా మరో లిరికల్ సాంగ్ వీడియో బయటకు వచ్చింది.
Waltair Veerayya.. ఆమెకేమో అందమెక్కువ..
హీరోయిన్ని ఉద్దేశించి.. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ..’ అంటూ మెగాస్టార్ పాటేసుకున్నారు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం.
శృతి హాసన్ గ్లామర్ సంగతి పక్కన పెడితే, ఆరు పదుల వయసులో మూడు పదుల వయసుకు దిగిపోయారు చిరంజీవి.!
మరోపక్క, డాన్సుల్లో చిరంజీవి గ్రేస్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆమెకేమో అందమెక్కువ.. నీకేమో గ్రేసు ఎక్కువ..’ అంటూ పాడుకుంటున్నారు ఈ సాంగ్ చూశాక మెగా అభిమానులు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. శేఖర్ ఈ సినిమాలో పాటలన్నిటికీ కొరియోగ్రఫీ అందించడం గమనార్హం.
Also Read: Vaarasudu Dil Raju: మొండికేశాడు.! కానీ, వెనక్కి తగ్గాడు.!
మెగాస్టార్ చిరంజీవితోపాటు ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. కేథరీన్ ట్రెసా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ‘బాస్ పార్టీ’ సాంగ్లో మెరిసింది.