Hansika Motwani Marriage.. ట్రెండ్ మారింది.! వివాహం.. ఓ అద్భుత సందర్భం. దాన్ని కూడా అమ్మేసుకుంటున్నారు సెలబ్రిటీలు.!
అగ్గిపుల్లా.. కుక్కపిల్లా.. కాదేదీ కవితకనర్హం.. అంటాడో కవి. కానీ, ఇక్కడ కాదేదీ అమ్మకానికినర్హం అంటున్నారన్నమాట.!
మొన్నామధ్యన నయనతార – విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి జరిగితే, ఆ పెళ్ళి తంతుని ఓ ఓటీటీ సంస్థకు అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయల డీల్ అది.
ఇదీ అసలు సిసలు కామెడీ..
నిజానికి నయనతార, వఘ్నేష్ శివన్‌ల పెళ్ళి ఎప్పుడో జరిగిపోయిందట. ఆ విషయం సరోగసీ వివాదం నేపథ్యంలో తెరపైకొచ్చింది.
కేవలం పెళ్ళి వీడియో అమ్మకం ద్వారా సొమ్ములు గడించొచ్చన్న కోణంలోనే, సెలబ్రిటీలను పిలిచి.. ఇంకోసారి విఘ్నేష్ – నయనతార పెళ్ళి చేసుకున్నారన్నమాట.

అదిరింది కదూ.! అంతా యాపారమే ఇక్కడ.! పెళ్ళయినా.. గర్భం దాల్చినా.. దేన్నయినా పబ్లిసిటీ పరంగా అమ్మేసుకోవచ్చు.
Hansika Motwani Marriage.. హన్సిక.. దేశముదురే..
బాల నటిగా సినిమాల్లోకొచ్చిన హన్సిక మోత్వానీ, తెలుగులో ‘దేశముదురు’ అనే సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.
మొన్నీమధ్యనే హన్సిక పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. వరుడికి అంతకు ముందే పెళ్ళయ్యింది.. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
ఇక, హన్సిక పెళ్ళి వీడియోలు బయటకు రాలేదు. వాటిని ఓ ఓటీటీ సంస్థకు అమ్మేశారు. త్వరలో అవి స్ట్రీమింగ్ కాబోతున్నాయట.
Also Read: మహేష్‌బాబు ఈజ్ బ్యాక్.! ఈసారి నెక్స్‌ట్ లెవల్.!
రేటు కోట్లలోనే పలికిందని సమాచారమ్.! అదిరింది కదూ.. అమ్మకానికి పెళ్ళి వేడుక అన్నమాట.
తప్పేముంది.? ఇది యాపారం.! వివాహమైనా.. ఇంకోటైనా.. తప్పదంతే.! డబ్బెవరికి చేదు.? సరోగసీల మార్గంలో బిడ్డల్ని కొనుక్కుంటున్నప్పుడు.. ఇక్కడ వ్యాపారం కానిది ఏమైనా వుంది.?