Damaka OTT Review.. థియేటర్లలో విడుదలై వసూళ్ళ దుమ్ము దులిపేసిన ‘ధమాకా’ ఓటీటీలోకి వచ్చేసింది.! థియేటర్లలో రిపీట్ మోడ్‌కి ఆస్కారం వుండదు కదా.!
అందుకే, ‘ఓటీటీ’ రిలీజ్ కోసం ఎదురుచూశారు, ఓ వర్గం సినీ అభిమానులు.! ఆ సినీ అభిమానులకి ‘ధమాకా’ ఓటీటీ రిలీజ్ పండగనే తీసుకొచ్చినట్లయ్యింది.
మరీ ముఖ్యంగా ఇంట్లోని స్క్రీన్లపై ‘ధమాకా’ని తిలకించేస్తూ, చిత్ర విచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’, ‘అల వైకుంటపురములో’ ఇలా పలు సినిమాల్ని కాపీ కొట్టేశారు ‘ధమాకా’ కోసం.!
ఓటీటీ రివ్యూల్లో జనం తిట్టి పోసేస్తున్నారు. ఇదేం సినిమా మహాప్రభో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Dhamaka OTT Review.. శ్రీలీల గ్లామరే స్పెషల్ ఎట్రాక్షన్..
శ్రీలీల ఈ సినిమాలో అతి చేసింది.. నటన పరంగా. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకున్న శ్రీలతో ‘అతి’ చేయించాలని దర్శకుడికి ఎలా అనిపించిందో ఏమో.!
అయినాగానీ, రిపీట్ మోడ్‌లో ‘ధమాకా’ని ఓ వర్గం ప్రేక్షకులు చూసేస్తున్నారు. దానిక్కారణం శ్రీలీల గ్లామర్.!
ఆ మాటకొస్తే, గ్లామర్ పరంగా మరీ అందాల ప్రదర్శన చేసిందేమీ లేదు ఈ బ్యూటీ.!

కాకపోతే, శ్రీలీల డాన్సులు.. అందునా, ‘పల్సర్ బైక్’ పాటకి శ్రీలాల చేసిన డాన్సుల్ని రిపీట్ మోడ్‌లో చూసేస్తున్నారు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి..
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. శ్రీలీలని డాన్సుల పరంగా ఇంకా బాగా చూపించి వుండొచ్చు. కొరియోగ్రఫీ చాలా వీక్‌గా అనిపిస్తోంది చాలామందికి.
తొలి సినిమా ‘పెళ్ళి సందడి’లోనే ఆమెను డాన్సుల పరంగా బాగా వాడేశారు. రాబోయే సినిమాల్లో ఆమె నుంచి మరిన్ని డాన్సింగ్ నంబర్స్ ఆశించొచ్చు.
Also Read: Tamannaah Bhatia డ్రెస్సు మీద ట్రోలింగ్.! వై దిస్ కొలవెరి.!
రవితేజ లుక్ విషయంలోనూ నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’లో లుక్ బావుందనీ, ‘ధమాకా’లో లుక్ సెట్ అవలేదనీ అంటున్నారు. ఓటీటీ రివ్యూలతో ఉపయోగమేంటి.?
‘ధమాకా’ ఏకంగా 100 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టేసిందాయె.! రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ధమాకా.