Balakrishna SV Ranga Rao.. అటు తిరిగి.. ఇటు తిరిగి విషయం రాజకీయంగా వివాదాస్పదమయ్యింది. నందమూరి బాలకృష్ణ నోటి దురద ఆయన కొంప ముంచేలా వుంది.
కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. నందమూరి బాలకృష్ణ అంటే శాసనసభ్యుడు కూడా. అంతటి బాధ్యతాయుతమైన పదవిలో వుండీ, సినీ వేదికపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలెలా చేసినట్టు.?
తెలుగు తెరపై తొలి తరం నటులుగా చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావుల గురించి చెప్పుకోవాల్సి వుంటుంది. కానీ, దురదృష్టం, ఆ చరిత్ర ఎప్పుడో వక్రీకరించబడింది.
Mudra369
సరే, కుర్రాళ్లలో కలిసిపోదామనుకుని, ఆరు పదుల వయసులో ‘బాల’తనం ప్రదర్శించే క్రమంలో బూతులు మాట్లాడారనుకుందాం. కానీ, ఎస్వీయార్.. ఏఎన్నార్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమేంటి.?
Balakrishna SV Ranga Rao.. విశ్వ నట చక్రవర్తి ఎస్వీయార్‌ని తూలనాడుతావా.?
‘విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు (SV Ranga Rao) కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు.. నువ్వే కాదు, మీ నాన్న ఎన్టీయార్ కూడా ఎస్వీయార్ కాలి గోటికి సరిపోరు.. నటనలో, వ్యక్తిత్వంలో..’ అంటోంది కాపునాడు.

ఈ మేరకు కాపునాడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అల్టిమేటం జారీ చేసింది. వెంటనే క్షమాపణ చెప్పకపోతే సహించేది లేదంటోంది కాపునాడు. మరి, బాలయ్య (Nandamuri Bala Krishna) ఏం చేస్తారు.?
జనవరి 25 లోపు నందమూరి బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నది కాపునాడు డిమాండ్.
తొలితరం నటుడు..
తెలుగు తెరపై తొలి తరం నటులుగా చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావుల గురించి చెప్పుకోవాల్సి వుంటుంది. కానీ, దురదృష్టం, ఆ చరిత్ర ఎప్పుడో వక్రీకరించబడింది.
Also Read: అయ్యయ్యో ఆర్జీవీ.! ఎలాంటోడివి.. ఇలా దిగజారిపోయావ్.!
ఇప్పుడీ బాలయ్య ‘ఆ రంగారావు.. ఈ రంగారావు’ అంటూ చేసిన వెకిలి వ్యాఖ్యల నేపథ్యంలో, ఎస్వీయార్ అభిమానులు.. సగటు సినీ అభిమానులు ఆ ఎస్వీయార్ ఘనతను ఇంకోసారి కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు.
మొత్తమ్మీద అటు అక్కినేని అభిమానులు.. ఇటు ఎస్వీయార్ అభిమానులు.. నందమూరి బాలకృష్ణని ఓ ఆట ఆడుకుంటున్నాయి సోషల్ మీడియా వేదికగా.
ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారి.. పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటోంది.