Regina Cassandra.. ‘ఎస్ఎమ్ఎస్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన చెన్నై బ్యూటీ రెజీనా కసండ్రా. తొలి సినిమాతో ఏమంత క్రేజ్ దక్కించుకోలేకపోయింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో బ్రేక్ వచ్చింది రెజీనాకి.
ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అంటూ బ్యాక్ టు బ్యాక్ ఈ మెగా హీరోతోనే స్ర్కీన్ షేర్ చేసుకుని సక్సెస్ అయ్యింది ఈ అందాల భామ.
బ్యాక్ టు బ్యాక్ ‘మెగా’ హిట్స్.!
ఈ రెండు సినిమాలూ తెలుగులో రెజీనాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి కమర్షియల్‌గా. ఆ తర్వాత పలు విభిన్నమైన సినిమాల్లోనూ రెజీనా నటించింది.
తెలుగుతో పాటూ, మాతృభాష తమిళం, మరియు హిందీలోనూ సినిమాలు చేసింది రెజీనా. ‘నేనేనా.?’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ తెలుగు సినిమాలో నటించింది రెజీనా. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదనుకోండి.
Regina Cassandra ఓటీటీలో బిజీ బిజీ..
అయితే, వెబ్ సిరీస్‌లతో ప్రస్తుతం బిజీగా వుంది రెజీనా కసండ్రా. హిందీలో వరుసగా రెండు వెబ్ సిరీస్‌లలో నటించింది రెజీనా. పవర్ ఫుల్ రోల్స్ పోషించింది ఈ సిరీస్‌లలో రెజీనా.

ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్ అవుతున్నాయ్ ప్రస్తుతం ఆ సిరీస్‌లు. కెరీర్ సంగతి అలా వుంటే, సోషల్ మీడియాలోనూ అమ్మడు ఫుల్ బిజీనే.
Also Read: ‘OG’ ఓ గాడ్.! పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. కొట్టుకోవాల్సిందేనా.?
ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంటుంది. తాజాగా పువ్వుల జాకెట్టు వేసుకుని డిఫరెంట్ స్టైల్‌లో ఫోటోలకి పోజిచ్చింది. షార్ట్ హెయిర్ స్టైల్‌తో న్యూ అప్పీల్ ఇస్తోంది రెజీనా.
జీబ్రా చెక్స్ పొట్టి గౌనుపై పువ్వుల డిజైనర్ జాకెట్ ధరించింది. ఫుల్ జోష్‌గా కనిపిస్తూ అందాల విందు చేస్తోంది ఈ పిక్స్‌లో రెజీనా. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్.
రెజినా జాకెట్టూ.. అందాల కనికట్టూ.. ఆమాత్రం హంగామా వుండదా ఏంటీ.?