Kiara Advani Siddharth Malhotra.. పెళ్ళంటే.. ఆ మాత్రం కిక్కు లేకపోతే ఎలా.? కైరా అద్వానీ – సిద్దార్ధ మల్హోత్రా పెళ్ళంట.. అంటూ గత కొన్ని నెలలుగా పెద్దయెత్తున ప్రచారం జరిగింది.
‘ఔనా.? నాకు పెళ్ళా.? ఎవరితో.? ఎప్పుడు.? కాస్త నాకైనా ఆ విషయం చెప్పరాదూ.? శుభలేఖ ఇస్తారా.? వెన్యూ ఎక్కడో చెబితే, వచ్చి విందు భోజనం ఆరగిస్తా..’ అంటూ సెటైర్లేసింది కైరా అద్వానీ ఆ మధ్య.
Kiara Advani Siddharth Malhotra.. ఇప్పుడిది నిజం.! అధికారికం.!
అందుకే, కైరా అద్వానీ పెళ్ళంటూ నాలుగైదు రోజులుగా జరుగుతున్న హడావిడినీ ఎవరూ నమ్మలేదు.
ఔను నిజంగానే నమ్మలేదు. మీడియా నుంచి అప్డేట్స్ వస్తున్నాయ్.. సోషల్ మీడియాలో బోల్డంత చర్చా జరుగుతోంది.
వధూవరులు.. అదేనండీ కైరా అద్వానీ.. సిద్దార్ధ మల్హోత్రా.. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కేసినా.. మీడియాలో డౌట్‌ఫుల్ కథనాలే వచ్చాయ్.

చివరికి పెళ్ళి ఫొటోలు బయటకు వచ్చాయ్. దాంతో, హమ్మయ్యా.. పెళ్ళయిపోయింది.. ఓ పనైపోయింది.. అని బాలీవుడ్ మీడియా ఊపిరి పీల్చుకుంది. నెటిజన్లూ కాస్త స్థిమిత పడ్డారు.
అయినా.. ఇంత డ్రామా అవసరమా.? ఇంత సస్పెన్స్ దేనికోసం.? మీడియాకి సమాచారం ఇస్తే వచ్చే నష్టమేంటి.? ఏమో కైరా – సిద్దార్ధ్‌లకే (Siddharth Malhotra) తెలియాలి.!
సస్పెన్స్ థ్రిల్లర్‌ని మించి హంగామా నడిచింది. ఈ పెళ్ళికి అతిథులుగా ఆహ్వానం అందుకున్నవారు సైతం ‘గప్‌చిప్’గా వ్యవహరించారు.
సెలబ్రిటీల పెళ్ళిళ్ళంటే బోల్డంత సందడి వుంటుంది. నిజానికి, అంతకు మించిన సందడే.. పెళ్ళి పందిట్లో వుందిట.!
పదుల సంఖ్యలో.. కాదు కాదు.. వందల సంఖ్యలో అతిథులు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారట.
రామ్ చరణ్ హీరోయిన్..
ఇక కైరా అద్వానీ (Kiara Advani) కెరీర్ విషయానికొస్తే, తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో తెరంగేట్రం చేసింది కైరా అద్వానీ. రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ సినిమాలోనూ నటించింది.
Also Read: వరుణ్ తేజ్ పెళ్ళి బాజా.! లావణ్య త్రిపాఠితోనేనా.?
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.