Hen and EGG Politics.. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? అవును కదా.. రాజకీయ నాయకులకన్నా సిగ్గూ ఎగ్గూ వదిలెయ్యాలి కదా.? జన బాహుళ్యంలో రాజకీయ వ్యవస్థ గురించి తరచూ జరిగే చర్చ ఇది.!
‘కోడి కత్తి’ ఓ రాజకీయ పార్టీని అధికార పీఠమెక్కించిందట.! అలాగని జనం అనుకోవడంంలో వింతేముంది.? నిజంగా ఆ కోడి కత్తి వల్లనే ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చి వుంటుందా.? ఏమో, గుర్రం ఎగరావచ్చు.!
కోడి సంగతి సరే.. అసలు కోడి గుడ్డు సంగతేంటి.? మళ్ళీ ఇక్కడ కోడి పురాణం గురించి తెలుసుకోవాలి. కోడి మాత్రమే గుడ్డు పెట్టగలదు. ఆ గుడ్డులోంచి కోడి పిల్ల వస్తుంది.!
నూడుల్స్ బండికి రిబ్బన్ కటింగ్ చేసిన మంత్రి కదా.! ‘చికెన్’ గురించి కూడా ఆ మాత్రం అవగాహన వుండే వుంటుంది.! అద్గదీ అసలు సమస్య.
Mudra369
ఔనా.? అసలంటూ తొలుత కోడి పుట్టిందా.? గుడ్డు పుట్టిందా.? ఇది మళ్ళీ భేతాళ ప్రశ్న. ప్రతి కోడి గుడ్డు లోంచీ, కోడి పిల్ల బయటకు వచ్చేయదు. కొన్ని గుడ్లు మురిగిపోతాయ్.!
అలాగే, కోడి గుడ్డులోంచి వచ్చిన పిల్లలన్నీ బతికెయ్యావు. కొన్ని ఎదిగే క్రమంలో చనిపోతాయ్.
Hen and EGG Politics.. ఇప్పుడెందుకీ కోడి పురాణం.?
ఇది అందరికీ తెలిసిన విషయమే కదా.? ఈ కోడి పురాణం గురించి ఇప్పుడెందుకీ ప్రస్తావన.? ఏ మంత్రిగారు.. ‘కోడి – కోడి గుడ్డు’ పురాణం చెప్పారు మరి.

కోడి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిని పెట్టలేదు. కోడి కేవలం గుడ్డుని మాత్రమే పెడుతుంది. ఆ గుడ్డుని హ్యాచ్ చేస్తే (అంటే, పొదగడం అన్నమాట) అందులోంచి కోడి పిల్ల వస్తుంది.
Also Read: కోవిడ్ వ్యాక్సిన్ గుచ్చారు.! గుండె జబ్బులు అంటగట్టారు.?
ఇదీ సదరు మంత్రిగారు చెప్పిన ‘కోడి – కోడి గుడ్డు పురాణం’.! ఇందుకే మరి, నవ్విపోదురుగాక రాజకీయ నాయకులకేటి సిగ్గు.? అని జనం అనుకునేది.!
రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరిస్తావయ్యా.? అంటే, ఇదిగో కోడి గుడ్డు పురాణం చెప్పాడు. కోడి.. గుడ్డుని పెడుతుంది సరే. ఆ గుడ్డు మురిగిపోతే.? ఔను, అభివృద్ధి మురిగిపోయింది.. అనడానికి సంకేతంగా ఈ పురాణం చెప్పాడాయన.
అవునూ.! ‘మంత్రి’ అనిపించుకోవడానికి కనీస అర్హతలు ఏమైనా అవసరమా.? ఇంగితజ్ఞానం కూడా లేనోళ్ళు చట్ట సభలకు వెళితే, ప్రజలేమైపోవాలి.?
ఏమైపోతారు.? చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత.! ఎన్నికల వేళ ఓట్లను జనం అమ్ముకుంటే.. ఇదిగో, ఇలాగే.. వ్యవస్థ మురిగిపోతుంది.!