Table of Contents
YS Vivekananda Reddy.. ఆయన చనిపోయి ఏళ్ళు గడుస్తోంది.! దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కూడా ఇంతవరకు దోషులెవరన్నది తేల్చలేకపోయింది.
న్యాయస్థానాల్లో కేసు విచారణ జరుగుతూ జరుగుతూ వుంది.! సీబీఐ విచారణ కొనసాగుతూనే వుంది.! ఇంకోపక్క నిస్సిగ్గు రాజకీయం సంగతి సరే సరి.!
‘ఇంతకీ నన్నెవరు చంపారో తేల్చండ్రా..’ అంటూ ఆ చనిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ క్షోభిస్తూనే వుంటుంది.
రాజకీయాల్లో అంతే..
ఔను, రాజకీయాల్లో అంతే.! ‘మేం జనాన్ని ఉద్ధరించేస్తాం..’ అని చెబుతారు రాజకీయ నాయకులు. అలాగే జనాన్ని మోసం చేసి అధికార పీఠమెక్కుతారు.
అత్యంత కిరాతకంగా ఓ ముసలాయన్ని గొడ్డలితో.. అందునా కసి తీరా నరికి చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది.?
అంత పైశాచికత్వం ప్రదర్శించి పెద్దాయన్ని చంపేస్తే.. ‘క్రైమ్ స్పాట్’ చూసి కూడా, ‘గుండె పోటు’ అని ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చింది.?
నరాలు తెగే ఉత్కంఠకి గురిచేసే థ్రిల్లర్ సినిమాల్లోనూ.. హర్రర్ సినిమాల్లో కూడా ఇంత క్రూరత్వం, పైశాచికత్వం వుండవేమో.!
Mudra369
మాటకు కట్టుబడి, జనాన్ని ఉద్ధరించాలి కదా.? వైఎస్ వివేకా అంటే ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ.!
అలాంటి వ్యక్తి చనిపోతే, ఏళ్ళు తరబడి కేసు సాగుతూ సాగుతూ వుండడమా.? సభ్య సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు.?
మాకేటి సంబంధం.?
హత్య జరిగిన సమయంలో అధికారంలో వున్నది టీడీపీ. కానీ, అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో వుంది. మరి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఏం చేసింది.?
‘అబ్బే, కేసు విచారణ సీబీఐ పరిధిలోకి వెళ్ళింది.. మేమేం చేయగలం.?’ అంటోంది వైసీపీ. సరిపోయింది సంబరం.!
మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలా.? లేదంటే, వైసీపీకి జాతీయ స్థాయిలో అధికారం దక్కాలా.? అప్పుడన్నా కేసు విచారణ ముందుకు జరుగుతుందా లేదా.?
YS Vivekananda Reddy.. మీడియా వంటకాలు..
ఎవరు చంపారో మీడియాకి తెలిసిపోయింది. రాజకీయ నాయకులకీ తెలిసిపోయింది.! అడ్డగోలుగా మీడియా వంటకాలు.. అంతకన్నా ఛండాలంగా రాజకీయ విమర్శలూ.!
ఇంకెందుకు సీబీఐ విచారణ.? ఇంకెందుకు న్యాయస్థానాలు.? నారాసుర రక్త చరిత్ర.. జగనాసుర రక్త చరిత్ర.. సరిపోయింది సంబరం.!
Also Read: సాయం చేసి ఓడిపోయావ్ చిరూ.! అందుకే నువ్వు ‘విజేత’వి.!
ఒక చావు.. ఇంతటి నీఛ నికృష్ట రాజకీయానికి కారణమయ్యిందా.? తప్పంతా జనాలదే. ఎందుకంటే, ఈ రాజకీయాల్ని ఎంటర్టైన్ చేస్తున్నదీ.. ప్రోత్సహిస్తున్నదీ ఆ జనమే కదా.?
ఇంతకీ, వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు ఎప్పుడు శాంతి చేకూరుతుంది.? ఆ ఒక్కటీ అడక్కూడదు.