Mamta Mohandas మృత్యువు కౌగిలిలోంచి రెండు సార్లు తప్పించుకుందామె.! రెండు సార్లు కాదు, చాలా సార్లు.. అని చెబుతుంటుంది.!
పరిచయం అక్కర్లేని పేరామెది.! ఆమె ఎవరో కాదు, నటి మమతా మోహన్ దాస్. కేవలం నటి మాత్రమే కాదు, ఆమె మంచి సింగర్ కూడా. సినిమాకి సంబంధించిన వివిధ విభాగాలపై ఆమెకు మంచి పట్టు వుంది.
తెలుగులో ‘యమదొంగ’, ‘కింగ్’ తదితర సినిమాల్లో నటించింది. పాటలు కూడా పాడింది మమతా మోహన్ దాస్.
క్యాన్సర్ బారిన పడి..
మమతా మోహన్ దాస్ ఒకసారి కాదు, రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. కానీ, కోలుకుంది. ‘కేడీ’ సినిమాలో మమతా మోహన్ దాస్ నాగార్జున సరసన నటించిన సంగతి తెలిసిందే.

అయితే, ఆ సినిమా సమయంలో ఆమె క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతోంది. ఆ సినిమా నుంచి తప్పుకోవాలని భావించినా, ఆమెకు నాగార్జున ధైర్యం చెప్పాడట.
ఈ విషయాన్ని స్వయంగా మమతా మోహన్ దాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘అప్పట్లో నాకు డబ్బు అవసరం. కానీ, సినిమా చేయలేను. అయితే, నాగార్జున ధైర్యం చెప్పారు..’ అని వెల్లడించింది మమతా మోహన్ దాస్.
ఇంకెవరైనా అయితే, తనను సినిమాలోంచి తీసేసేవారేననీ, తానే సినిమా నుంచి వెళ్ళిపోతానన్నా నాగార్జున తనకు అండగా నిలిచారని చెబుతూ మమతా మోహన్ దాస్ ఎమోషనల్ అయ్యింది.
Mamta Mohandas నాగార్జున లేకపోతే..
ఆ సమయంలో నాగార్జున లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో.? బహుశా ఆయనిచ్చిన ధైర్యంతోనే ఆ దఫా క్యాన్సర్ నుంచి విజయం సాధించానేమో.. అని మమత చెప్పుకొచ్చింది.
Also Read: Eesha Rebba.. ‘షి’కారు.! కుర్రకారు గుండె జారు.!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా కోసం మమతా మోహన్ దాస్ ‘ఆకలేస్తే..’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌కి వాయిస్ అందించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది మమతా మోహన్ దాస్.