Home » Srinidhi Shetty: ఏం.? బ్లాక్ అండ్ వైట్‌కి ఏం తక్కువ.!

Srinidhi Shetty: ఏం.? బ్లాక్ అండ్ వైట్‌కి ఏం తక్కువ.!

by hellomudra
0 comments
Srinidhi Shetty

Srinidhi Shetty Frozen Monochrome.. శ్రీనిధి శెట్టి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ‘కేజీఎఫ్’ సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఒక్క సినిమాతోనే స్టార్ అయిపోయిందీ ముద్దుగుమ్మ.

కానీ, ఆ స్టార్‌డమ్ కేవలం సింగిల్ సినిమాకే పరిమితమైంది. ఇంకేముంది.! ఈ సినిమా తర్వాత శ్రినిధికి అవకాశాలు క్యూ కడతాయనుకున్నారంతా.

కానీ అలా జరగలేదు. కేవలం ‘కేజీఎఫ్’ బ్యూటీగానే మిగిలిపోయింది శ్రీనిధి శెట్టి. ‘కేజీఎఫ్’ రెండు సిరీస్‌లలోనూ హీరోయిన్‌గా నటించింది.

Srinidhi Shetty Frozen Monochrome.. ‘కోబ్రా’లో దూసుకొచ్చినా.!

ఆ తర్వాత తమిళ సీనియర్ నటుడు విక్రమ్‌తో ‘కోబ్రా’ అనే సినిమాలో నటించింది కానీ, ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది.

తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమాకి సైన్ చేసింది కానీ, ఆ సినిమా స్టేటస్ ఏంటో ఇంతవరకూ తెలియదు. అలాగే ఓ కన్నడ సినిమాకీ శ్రినిధి శెట్టి సైన్ చేసింది.

Srinidhi Shetty
Srinidhi Shetty

‘కేజీఎఫ్’ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే శ్రీనిధి శెట్టికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు పాపులర్ సినిమాల్లో అవకాశాలొచ్చాయట.

కానీ, ‘కేజీఎఫ్’ కమిట్మెంట్‌తో ఆ ప్రాజెక్టులన్నీ వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty).

Also Read: వైరల్ ఫీవర్‌కి నెబ్యులైజర్‌తో చెక్: డాక్టర్ సమంత సిల్లీ చిట్కా.!

అలా ఈ క్రేజీ బ్యూటీ సినిమా ప్రస్థానం అంతంత మాత్రంగానే సాగుతోంది. అయితే, సినిమాలదేముంది.! సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి క్రేజ్ వేరే లెవల్.

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సేమ్ టు సేమ్ అనేంతలా శ్రినిధిని అభిమానించే ఫ్యాన్స్ వున్నారు నెట్టింట్లో. వారి కోసమే అప్పుడప్పుడూ కొన్ని ఫోటోలు షేర్ చేస్తుంటుంది శ్రినిధి శెట్టి.

Srinidhi Shetty
Srinidhi Shetty

తాజాగా శ్రినిధి శెట్టి పోస్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయ్. కుర్రకారులో గిల్లుడు షురూ చేస్తున్నాయ్.

‘Moments Frozen In Monocrome..’ అని క్యాప్షన్ పెట్ట్టింది. నిజంగానే తన బ్లాక్ అండ్ వైట్ అందచందాలతో కుర్ర హృదయాల్ని ఫ్రీజ్ చేస్తోంది అందాల శ్రినిధి శెట్టి ఈ పోజుల్లో.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group