Pavitra Naresh Wedding.. ఔను, పెళ్ళయిపోయింది.! ‘మీ ఆశీస్సులు కోరుకుంటూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ‘పెళ్ళి’కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు సీనియర్ నటుడు నరేష్.
ఎవరితో నరేష్‌కి పెళ్ళయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ఆమె ఎవరో కాదు, సీనియర్ నటి పవిత్ర లోకేష్. గత కొంతకాలంగా పవిత్ర, నరేష్ మధ్య ఏదో నడుస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
పెళ్ళయిపోయిందా.? నిజంగానే పెళ్ళి చేసుకున్నారా.?
Mudra369
లేదంటే, సినిమా కోసమో.. వెబ్ సిరీస్ కోసమో జరిగిన వివాహ తంతు మాత్రమేనా.?
నరేష్, తన భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇచ్చాడా.? లేదా.?
ప్రచారం జరగడమేంటి.. నిజంగానే ఇద్దరి మధ్యా ‘వ్యవహారం’ నడుస్తూ వచ్చింది. నరేష్ మూడో భార్య ఈ మేరకు నరేష్ మీద న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.
Naresh Pavitra Wedding.. ఎవరి గోల వారిదే..
అటు నరేష్, ఇటు నరేష్ సతీమణి రమ్య రఘుపతి.. ఇరువురూ మీడియాకెక్కి తమ తమ వ్యక్తిగత జీవితాల్ని బజారుకీడ్చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదులు.. కోర్టు కేసులు.. ఇలా పెద్ద కథే వుంది.
ఇంతకీ నరేష్ – రమ్యల విడాకులు జరిగిపోయాయా.? విడాకులు జరగకుండానే నరేష్ – పవిత్ర ‘వైవాహిక’ బంధంతో ఒక్కటయ్యారా.?
బోల్డన్ని అనుమానాలు. అసలు ఇది నిజమైన పెళ్ళేనా.? అన్న అనుమానాలూ లేకపోలేదు. ఏమో, ఏం జరిగిందో ఆ ఇద్దరికే తెలియాలి.
‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. ఇట్లు పవిత్ర నరేష్’ అంటూ నరేష్ వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
Also Read: నాన్నంటే నరకం: బాంబు పేల్చిన సీనియర్ నటి ఖుష్బూ!
సూపర్ స్టార్ కృష్ణ మరణించినప్పుడూ.. మంచు మనోజ్ వివాహ వేడుక సందర్భంలోనూ నరేష్, పవిత్ర జంటగా రావడం.. అప్పట్లో హాట్ టాపిక్.!
ఇంతకీ, పవిత్ర – నరేష్ ఇద్దరూ ‘వైవాహిక బంధం’తో ఒక్కటయ్యారా.? లేదా.? మళ్ళ అదే ప్రశ్న.! ఈ డౌటానుమానాల సంగతెలా వున్నా, సోషల్ మీడియా వేదికగా ‘ఆల్ ది బెస్ట్’ చెప్పేస్తున్నారు నెటిజన్లు కొత్త జంటకి.