Raviteja Ravanasura Inside Report మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ విడుదలకు సిద్ధమైంది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
‘ధమాకా’ లాంటి సోలో హిట్ తర్వాత, ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మల్టీస్టారర్ చేశాక.. రవితేజ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ‘రావణాసుర’ సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటేశాయ్.!
నిజానికి, ‘ధమాకా’ సినిమాతోనే రవితేజ మార్కెట్ 100 కోట్లను టచ్ చేసేసింది. ఈ నేపథ్యంలో ‘రావణాసుర’ అంతకు మించి వుంటుందనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
Raviteja Ravanasura Inside Report.. ఇంతకీ ‘రావణాసుర’ సీన్ ఏంటి.?
ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘రావణాసుర’ మరో ‘ధమాకా’ కాబోతోందిట.! ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్.. అంటూనే, దీన్నొక థ్రిల్లింగ్ మాస్ మూవీ.. అని అంటున్నారు.
రవితేజ ఎనర్జీని వేరే లెవల్‌లో చూడబోతున్నామట.!
డాన్సుల్లోనూ రవితేజ కొత్త ఎనర్జీ చూపించాడట.!
డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్.. అన్నీ కొత్తగా వుండబోతున్నాయట.!
అంతమంది హీరోయిన్లున్నా.. అన్ని పాత్రలూ కీలకమేనట.!
ప్రేక్షకుడ్ని అడుగడుగునా థ్రిల్‌కి గురిచేసేలా సినిమా వుంటుందట.!
ఇలా ఇన్‌సైడ్ సోర్సెస్ నుంచి ‘రావణాసుర’పై రిపోర్ట్స్ వస్తున్నాయ్.!
Mudra369
రవితేజ (Mass Maharaj Raviteja) సరసన ఈ ‘రావణాసుర’ సినిమాలో చాలామంది హీరోయిన్లు కనిపించబోతున్నారు.
అనూ ఇమ్మాన్యుయేల్, ఫరీయా అబ్దుల్లా, దక్ష నగార్కర్, మేఘా ఆకాష్.. ఇలా ఇంతమంది హీరోయిన్లతో రవితేజ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వుండబోతోందన్న ఉత్కంఠ అంతటా కనిపిస్తోంది.
ఇంతమంది హీరోయిన్లతో కలిసి ఒకే సినిమా కోసం పని చేయడం రవితేజకి బహుశా కెరీర్‌లో ఇదే తొలిసారి అనుకోవచ్చేమో.!
Also Read: కైరా అద్వానీ.! అందమైన ‘మామిడి పండు’లా కొత్త పెళ్లికూతురు.!
ప్రోమోస్ అయితే ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేశాయ్. రవితేజ (Mass Maharaj Raviteja) షరామామూలుగానే సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.
చూద్దాం.. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రావణాసుర’ (Ravanasura) రవితేజ కెరీర్‌లో మరో స్టన్నింగ్ హిట్ అవుతుందో లేదో.!