Priyanka Mohan OG.. ప్రియాంక మోహన్ గుర్తుందా.? అదేనండీ, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కదా.. ఆ ముద్దుగుమ్మే.!
నాని (Natural Star Nani) హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader) అప్పట్లో ‘మమ’ అనిపించింది. ఆ తర్వాత ప్రియాంక మోహన్ తెలుగులో నటించిన ‘శ్రీకారం’ సినిమా కూడా అంతే.
ఏం ఆమెకేం తక్కువ.? అందం అభినయం, అన్నీ వున్నా.. స్టార్డమ్ కొలతలేసి, అవమానిస్తారా.?
నిర్మాణ సంస్థల్నీ, దర్శకుల్నీ బదనాం చేసే స్థాయికి హీరోల అభిమానులెందుకు వెళ్ళిపోతున్నారు.?
ఏమో, భవిష్యత్తులో ప్రియాంక మోహన్ కూడా స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో.!
Mudra369
‘శ్రీకారం’ సినిమాలో శర్వానంద్ హీరో.! ఆ సినిమా కూడా పెద్దగా ఆడింది లేదు. కానీ, ప్రియాంక మోహన్‌కి (Priyanka Mohan) ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది తెలుగునాట.
సోషల్ మీడియాలో.. అభిమాన హోరు.!
ప్రియాంక మోహన్‌కి సోషల్ మీడియాలో బోల్డంత ఫాలోయింగ్ వుంది. గ్లామర్ విషయంలో హద్దుల్లోనే వుంటుందిగానీ, ఆమె క్యూట్ అప్పీల్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

తమిళంలో ఓ మోస్తరు నుంచి పెద్ద సినిమాలు కూడా చేసింది ప్రియాంక మోహన్. సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల సరసన నటించిందీ ముద్దుగుమ్మ.
Priyanka Mohan OG.. పవన్ కళ్యాణ్ సరసన.!
పవన్ కళ్యాణ్ సరసన సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం ప్రియాంక మోహన్ పేరు ఖరారయ్యిందట. దాంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు గుస్సా అవుతున్నారు.
ప్రముఖ హీరోయిన్ని పెట్టుకోవాల్సింది పోయి, ఊరూ.. పేరూ.. లేని ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) ఎందుకు.? అంటూ, దర్శకుడిపైనా, చిత్ర నిర్మాణ సంస్థపైనా మండిపడుతున్నారు.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
ఇదంతా గురూజీ పైత్యమే.. పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమాలపై గురూజీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) పెత్తనం బాగా పెరిగిపోయిందన్నది పవన్ కళ్యాణ్ అభిమానుల ఆరోపణ.
ఏంటో, అభిమానులే కాంబినేషన్లనీ డిసైడ్ చేసేసే పరిస్థితి.. కాదు కాదు, శాసించే పరిస్థితి వచ్చేసింది.