Brahmanandam Politics సినీ నటులు రాజకీయ పార్టీలు స్థాపించి, అధికార పీఠమెక్కిన సందర్భాలున్నాయ్.! రాజకీయాల్లో రాణించలేకపోయిన సినీ నటులూ వున్నారు.
రాజకీయం అంటే, అదేదో కొందరు టచ్ చేయకూడని విషయం.. అన్న భ్రమలు ఇంకా చాలామందికి వున్నాయి.
ఫలానా పార్టీకి ఎందుకు మద్దతిచ్చావ్.? ఫలానా పార్టీకి ఎందుకు విమర్శించావ్.? అని సినీ నటుల్ని ప్రశ్నించేటోళ్ళు చాలామందే వున్నారు.
ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, బీజేపీ తరఫున కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం రాజకీయంగా పెద్ద చర్చకే తెరలేపింది.
Brahmanandam Politics బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారమా.?
అయితే, బీజేపీ తరఫున కాదు, బీజేపీ అభ్యర్థి తరపున బ్రహ్మానందం ఓ నియోజకవర్గంలో.. కొన్ని గ్రామాల్లో పర్యటించి, ప్రచారం చేశారంతే.! అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బ్రహ్మానందంకి సన్నిహితుడట. అదీ అసలు సంగతి.
కానీ, అది జీర్ణించుకోలేక బ్రహ్మానందంపై కొందరు నానా రకాల విమర్శలూ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి మద్దతుగా ఎలా ప్రచారం చేశావ్.? అని ప్రశ్నిస్తున్నారు కొందరు.
మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి సినీ నటుడు రజనీకాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు మీద ప్రశంసలు గుప్పిస్తే, ఆయన్నీ తూలనాడారు.
రాజకీయ స్నేహాలు వుండకూడదా.?
ఎటు పోతోంది సమాజం.? వ్యక్తులకు రాజకీయ పరమైన స్నేహాలు వుండకూడదా.? వుంటే అది నేరమవుతుందా.? ఓ పార్టీకి చెందిన నాయకుడు ఇంకో పార్టీకి చెందిన నేతతో బంధుత్వం కలిగి వుంటాడు.! అది తప్పు కాదు.!
‘స్నేహం వేరు.. రాజకీయం వేరు..’ అని ఓ వైపు చెబుతూనే.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతుంటారు ఇంకొందరు.
రాజకీయ ప్రత్యర్థులతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ, కింది స్థాయి కార్యకర్తల్ని రెచ్చగొట్టే నాయకులు కోకొల్లలు.
Also Read: విజయ్ దేవరకొండ ‘The’పై అనసూయ అక్కసు.!
ఆయా పార్టీలకు కార్యకర్తలుగా కాదు, కూలీలుగా.. బానిసలుగా వ్యవహరిస్తున్న సోకాల్డ్ మద్దతుదారులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.
తమ తమ నియోజకవర్గాల్లో గెలిచిన రాజకీయ నాయకులు, అక్కడి సమస్యలపై స్పందించకపోతే నిలదీయాలి.! అది మానేసి, ఇదేం పద్ధతి.?
ఆయా రాజకీయ పార్టీలకు ‘కూలీలు’గా మారిపోతున్నారు కొందరు నెటిజన్లు. వాళ్ళతోనే అసలు సమస్య.!