Agent Disaster Akhil Surender.. ఏ సినిమా హిట్టవుతుందో.. ఏ సినిమా ఫ్లాపవుతుందో ముందే ఎవరూ ఊహించలేరు. ఊహించగలిగితే, అసలంటూ ఫ్లాప్ సినిమాలే రావు.!
ఎవరు మాత్రం కోట్లు ఖర్చు చేసి ఫ్లాప్ సినిమాలు తీయాలనుకుంటారు.? కెరీర్‌ని పణంగా పెట్టి ఫ్లాప్ సినిమాలు చేయాలని నటీనటులు మాత్రం అనుకుంటారా.? ఛాన్సే లేదు.
‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.
Agent Disaster Akhil Surender.. క్షమాపణ చెప్పిన అఖిల్..
అఖిల్ (Akkineni Akhil) ‘ఏజెంట్’ డిజాస్టర్‌పై ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు. అందులో, ‘సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ, మంచి ఫలితాన్ని పొందలేకపోయాం..’ అని వాపోయాడు.
కాస్ట్ అండ్ క్రూ.. అంటూ అందర్నీ కలిపేశాడు.. అందరికీ థ్యాంక్స్ చెప్పేశాడు అఖిల్ (Akhil Akkineni). నిర్మాత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

కానీ, కెప్టెన్ ఆఫ్ ది షిప్.. అదేనండీ, దర్శకుడి సంగతేంటి.? చావుబతుకులతో పోరాడాల్సి వచ్చింది దర్శకుడు సురేందర్ రెడ్డి.
ఎందుకు మర్చిపోయావ్.?
ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్లలో అఖిల్ స్వయంగా చెప్పాడు. కానీ, ‘ఎమోషనల్ నోట్’లో మాత్రం, దర్శకుడి పేరుని అఖిల్ ప్రస్తావించలేదు.
నిర్మాత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, దర్శకుడ్ని ప్రస్తావించకపోవడమంటే.. అది దర్శకుడ్ని అవమానించినట్టే కదా.?
Also Read: ‘లైగర్’ బాబూ.! అనసూయ సంగతేంటో చూడు.!
ఈ విషయమై అఖిల్ అభిమానులూ ఒకింత నొచ్చుకుంటున్నారు. యంగ్ హీరో అఖిల్.. ఇలా ఎందుకు చేశాడబ్బా.? ఏదో బలమైన కారణమే వుండి వుంటుందన్నది ఇంకొందరి వాదన.
అయినా, అఖిల్‌కి ఫ్లాపులు కొత్త కావు. కాకపోతే, ‘ఏజెంట్’ చాలా పెద్ద డిజాస్టర్. నేరుగా టైర్ వన్ హీరో అయిపోతాడు అఖిల్.. అనుకున్నారు చాలామంది.! కానీ, ప్చ్.. స్థాయి దిగజారిపోయింది.
అక్కినేని అఖిల్.. కెరీర్‌లో ఇంకా చూడాల్సింది చాలా వుంది. ఎక్కాల్సిన శిఖరాలే కాదు.. పడాల్సిన లోయలు కూడా వుంటాయ్.! నిర్మాత గురించి ప్రస్తావించడం అభినందనీయమే.
దర్శకుడి గురించి కూడా ప్రస్తావించి వుంటే బావుండేది. ప్రస్తావించకపోవడం ముమ్మాటికీ అవమానించడం కిందే భావించాలి.