Samantha With Siddu Jonnalagadda.. ‘డీజె టిల్లు’ సినిమాతో క్రేజీ హీరో అయిపోయాడు సిద్ధు జొన్నలగడ్డ. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. బాక్సాపీస్ వద్ద కాసుల పంట పండించింది.
కాగా, ఈ సెన్సేషనల్ హీరోతో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ చేయబోతోంది డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నందినీ రెడ్డి.
సమంతతో ‘ఓ బేబీ’ చిత్రం తెరకెక్కించి దర్శకురాలిగా తన మార్క్ క్రియేట్ చేశారు నందినీ రెడ్డి. ఈ సినిమాతో సమంతకీ, నందినీ రెడ్డికి మధ్య మంచి స్నేహం కుదిరింది.
Samantha With Siddu Jonnalagadda.. స్నేహమంటే ఇదే.
ఆ స్నేహంతోనే తాజాగా ఓ క్రేజీ స్టోరీని సమంతకు వినిపించిందట. సమంతకు తెగ నచ్చేసిందట. త్వరలోనే సినిమా స్టార్ట్ చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.

రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మించేందుకు రెడీగా వున్నారట. కాగా ఈ సినిమాలో మేల్ లీడ్ కోసం సిద్ధు జొన్నలగడ్డను ప్రిఫర్ చేసిందట నందినీ రెడ్డి.
ఆ విషయంలో సమంత అభిప్రాయం అడగ్గా.. తనకేమాత్రం అభ్యంతరం లేదని చెప్పిందట. అలా సిద్ధుతో సమంత.. ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది.
వావ్.! వాట్ ఏ క్రేజీ.!
సమంత ప్రస్తతం స్టార్ ఇమేజ్ వున్న హీరోయిన్. సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న హీరో. అలాంటిది, ఈ ఇద్దరి కాంబినేషన్ ఇలా సెట్ అవ్వడంపై ఫ్యాన్స్‌లో ఒకింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.
త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం సమంత ‘ఖుషీ’ సినిమాతో బిజీగా వుంది. అలాగే, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కోసం చాలా కష్టపడుతోంది.
మరోవైపు సిద్దు జొన్నలగడ్డ తన బ్లాక్ బస్టర్ హిట్ ‘డీజె టిల్లు’కి సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా వున్నాడు.