Krithi Shetty.. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టికి ఇప్పుడు అస్సలు కలిసి రావడం లేదు. ఏది పట్టినా మట్టే అయిపోతోంది. వరుస ఫెయిల్యూర్స్ కృతిశెట్టిని వెంటాడుతున్నాయ్.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది కృతి శెట్టి. కొంతమంది నెటిజన్లు పని గట్టుకుని మరీ తనను తిట్టి పోస్తున్నారని వాపోతోంది.
అంతలా వాళ్లు తిట్టుకునేంత తప్పు తానేం చేశానని క్వశ్చన్ చేస్తోంది. అవును నిజమే.. ఈ మధ్య కృతి శెట్టి చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్.

Krithi Shetty.. కొంచెం స్వీటుగా.. కొంచెం ఘాటుగా..
కానీ ఆయా సినిమాల ఫెయిల్యూర్స్‌లో కేవలం కృతి శెట్టి మాత్రం భాగం కాదు కదా.. 24 క్రాఫ్ట్స్‌లో హీరోయిన్‌గా కృతి శెట్టి ఓ చిన్న పార్ట్ అంతే.
కానీ, కృతి శెట్టి కారణంగానే సినిమా ఫెయిలైందంటూ నెగిటివిటీని స్ర్పెడ్ చేస్తూ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారంటూ కృతి శెట్టి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఫెయిల్యూర్స్ వస్తే, ఓ హీరోయిన్‌ని ఇంతలా విమర్శిస్తారా.? ఇదేమి సంస్కారం అంటూ ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి తన ఆవేదనను బయట పెట్టింది.
‘మీ ఫ్యామిలీ గురించి కూడా ఇలాంటి వార్తలు రాస్తే భరించగలరా.?’ అని ఆన్ లైన్ వేదికగా ఈ మధ్య కొందరు సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి ట్రోల్స్ చేస్తున్న వారిని కూడా కడిగి పడేసింది క్యూట్‌గా కృతి శెట్టి.

నేను ఏ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు మొర్రో.!
ఫెయిల్యూర్స్ గురించే కాదట. తన ఫిజిక్ విషయంలోనూ దారుణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందనీ అంటోంది కృతి శెట్టి.
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందం చెడగొట్టుకుందంటూ ఈ మధ్య కొన్ని కథనాలు వెలువడ్డాయ్ కృతి శెట్టి మీద. హీరోయిన్ల అందం, ఫిజిక్‌కి రకరకాల కారణాలుంటాయని కృతి శెట్టి గుస్సా అవుతోంది.
పాత్రలకనుగుణంగా వేసే మేకప్ కావచ్చు, హెయిర్ స్టైల్స్ వంటి ఇతరత్రా కారణాలు కావచ్చు.. లేదంటే వయసు రీత్యా సహజంగా వచ్చే మార్పులు కావచ్చు.. అని ఆయా ట్రోల్స్‌పై కృతి శెట్టి క్రిస్పీగా క్లారిటీ ఇచ్చేసింది.