Anni Manchi Sakunamule Review.. చెడు శకునం నందిని రెడ్డి.!

Anni Manchi Sakunamule Review

Anni Manchi Sakunamule Review.. నందిని రెడ్డికి ఏమైంది.? ‘అన్నీ మంచి శకునములే’ సినిమా గురించి అంతటా జరుగుతున్న చర్చ ఇది.!

కూల్ అండ్ లవ్లీ మూవీ.. అనే పాజిటివ్ బజ్‌తో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రేక్సకుల ముందుకొచ్చింది. రివ్యూలు రాసేటోళ్ళకి, సినిమాపై నెగెటివ్‌గా ఏం రాయగలం.? అని మనసులో అనిపించింది.

కానీ, తెరపై సన్నివేశాలు ‘సాగు’తున్న తీరు.. పాత చింతకాయ పచ్చడిలా కథా గమనం.. అంతా చూశాక, విమర్శించకుండా వుండలేకపోయారు.

Anni Manchi Sakunamule Review.. నటీనటులు ఓకేగానీ..

హీరో సంతోష్ శోభన్ కావొచ్చు.. హీరోయిన్ మాళవిక నాయర్ కావొచ్చు.. ఇద్దరూ కేపబుల్ నటీనటులే.! కానీ, ఏం లాభం.? వాళ్ళ ఎబిలిటీస్‌ని వాడుకోలేకపోయింది దర్శకురాలు నందిని రెడ్డి.

‘ఇలాంటి సినిమాలు రావాలి.. హిట్టవ్వాలి..’ అని కోరుకునేటోళ్ళు కూడా, ఈ సినిమాని క్షమించలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

‘ఓ బేబీ’ సినిమా తీసిన నందిని రెడ్డేనా ఈ ‘అన్నీ మంచు శకునములే’ సినిమా తీసింది.? అని సినిమా చూసినవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు.

మంచి ట్యూన్లు ఇవ్వగల మ్యూజిక్ డైరెక్టరే.! కాకపోతే, అతన్నుంచి సరైన ట్యూన్లు రాబట్టలేకపోయారు.

ఖర్చు చేసేశారు..

ఖర్చు మాత్రం గట్టిగానే చేశారు నిర్మాతలు.! అభిరుచిగల నిర్మాతలే ఇలాంటి రుచీ పచీ లేని వంటకాన్ని ఎలా ఒప్పుకున్నారన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.

మంచి సీజనే ఇది.! ఈ సీజన్‌లో కూల్ అండ్ లవ్లీ సినిమా పడుంటే.? ప్చ్.. ఛాన్స్ మిస్ చేసుకుంది ‘అన్నీ మంచి శకునములే’ టీమ్.!

hellomudra

Related post